Omicron Cases: ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ భయం.. కొత్తగా మరో 4 కేసులు నమోదు..
ఏపీలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు భయందోళనకు గురి చేస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు వరుసగా నమోదువుతూ ఉన్నాయి. కొత్తగా.. 4 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. మెుత్తం 28 కేసులు నమోదయ్యాయి. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికీ, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు కూడా ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
మరోవైపు ఏపీలో కొత్తగా.. 434 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,848 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 32,785 మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా నుంచి మరో 102 మంది బాధితులు కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరణాలు సంభవించలేదు.
#COVIDUpdates: 05/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 5, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,75,481 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,134 మంది డిశ్చార్జ్ కాగా
*14,499 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,848#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oCv6S1fEcy
దేశంలో కేసులు
కరోనా వైరస్ గేరు మార్చింది. దేశంలో మళ్లీ సెకండ్ వేవ్ తరహా పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా 58,097 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా 2100 మార్కు దాటింది. ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2135కు చేరింది.
కరోనా, ఒమిక్రాన్ కేసులు రెండింటిలోనూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 653 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 18,466 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,30,494కు చేరింది. మరణాల సంఖ్య 1,41,573కు పెరిగింది.
మహారాష్ట్రలో కొత్తగా 75 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు పెరిగింది.
కొత్తగా నమోదైన 75 ఒమిక్రాన్ కేసుల్లో 40 ముంబయిలోనే నమోదయ్యాయి. 9 థానే నగరంలో, 8 పుణెలో, 5 పాన్‌వేల్‌లో, కొల్హాపుర్, నాగ్‌పుర్‌లో చెరో 3 కేసులు నమోదయ్యాయి. ముంబయిలో కొత్తగా 10,606 కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (ఎమ్‌ఏఆర్‌డీ) అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం గత 48 గంటల్లో 170 మంది వైద్యులకు పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, భాజపా గుర్‌గావ్ ఎమ్మెల్యే విద్యా ఠాకూర్, దక్షిణ ముంబయి ఎంపీ అర్వింద్ సావంత్‌కు కూడా కరోనా సోకింది.
మహారాష్ట్రలో 10 మందికి పైగా మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కరోనాకు గురయ్యారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం
Also Read: Covid 19 Vaccine: భయపడకండి.. బూస్టర్ డోస్ వచ్చేసింది.. చుక్కల మందుకు డీసీజీఐ అనుమతి!