Top Headlines: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - మద్యం ప్రియులకు గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో సెక్యూరిటీ లోపం
పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సమయంలోనే సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఐపీఏస్ ఆఫీసర్ కలకలం సృష్టించడం కలకలం సృష్టించింది. సమాచారమందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ యూనిఫారమ్ లో వచ్చిన వ్యక్తిని సూర్య ప్రకాష్ గా గుర్తించారు అధికారులు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఐపీఏస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న ఓ వ్యక్తి ఆయన వెన్నంటే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళితే, అక్కడికి వెళ్లాడు. ఇంకా చదవండి.
2. వైసీపీ బలమైన పునాదులపై పవన్ గురి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. తాను బలపడటం మాత్రమే కాదు వైసీపీని మరితం బలహీన పరిచేదుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెబుతున్నారు. వైసీపీకి ఎంత ఎదురుగాలి వీచినా గిరిజన ప్రాంతాల్లో మాత్రం పట్టు నిలుపుకుంది. అరకు పార్లమెంట్ సీటును గెల్చుకుంది. అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లనూ గెల్చుకుంది. సిక్కోలు నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి వచ్చిన రెండు సీట్లు అవే. ఇంకా చదవండి.
3. సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్
తెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్లే వారి సౌలభ్యం కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెగ్యులర్‌గా నడిచే బస్సులతో పాటు అదనంగా ఈ స్పెషల్ బస్సులు నడుపుతామని చెప్పారు. ఇంకా చదవండి.
4. మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతోంది. అనేక దేశాలు వాటిల్లోని రాష్ట్రాల ప్రజలు ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ కి ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలా అని ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త సంవత్సరం అనగానే గుర్తొచ్చేది సెలబ్రేషన్స్. దాంతో పాటు లిక్కర్ సేల్స్. ఈ రోజున మద్యం ఏరులై పారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చదవండి.
5. ఆ జిల్లాలను వణికిస్తోన్న పెద్ద పులి
మొన్నటివరకూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. రెండు చోట్ల మనుషులపై దాడులు సైతం జరగగా, ఓ ఘటనలో వ్యక్తి మృతి చెందగా.. మరోచోట తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. తాజాగా
ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులను పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వెల్లి పరిశీలించి పులి సంచారం నిజమేనని తేల్చారు. ఇంకా చదవండి.