Today Top Headlines: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరస్వతీ పవర్ ప్లాంట్‌కు (Saraswati Power Plant) కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసింది. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్‌ను కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. ఇంకా చదవండి.
2. రియల్ ఎస్టేట్ ఇంట్లో భారీ చోరీ
అనంతపురం (Anantapuram) నగర శివారులో దొంగలు బీభత్సం సృష్టించారు. శివారెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో కూతురు పెళ్లి కోసం ఉంచిన నగదు, రూ.కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగర శివారులోని బెంగుళూరు - హైదరాబాద్ హైవే సమీపంలో సవేరా ఆస్పత్రి వెనుక వైపు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి రాజహంస విల్లాస్‌లో బుధవారం భారీ చోరీ జరిగింది. ఇంకా చదవండి.
3. తెలంగాణలో భారీ పెట్టుబడులు
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (World Economic Forum) వేదికపై తెలంగాణ (Telangana) మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. ముఖ్యంగా 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్ర యువతకు దాదాపు 10,800 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ 'సన్ పెట్రో కెమికల్స్' రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఇంకా చదవండి.
4. పటాన్ చెరు కాంగ్రెస్‍లో లొల్లి
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. పటాన్ చెరు కాంగ్రెస్ నేతలు రోడ్డున పడి కొట్టుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ వర్గం రోడ్డు ఎక్కి సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు అందుకుంది. పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య పొసగడం లేదని అధినాయక్వం కలుగుజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ చిచ్చు పెట్టాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు వ్యతిరేకంగా విమర్సలు చేయడం ప్రస్తుతం వివాదానికి కారణమైంది. ఇంకా చదవండి.
5. మీర్‌పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మీర్‌పేట (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన భార్యను చంపడానికి ముందు నిందితుడు ఓ కుక్కను చంపి ట్రయల్ వేసినట్లుగా తెలుస్తోంది. కుక్కను ముక్కలుగా నరికి ఉడకబెట్టినట్లు సమాచారం. మీర్‌పేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఇంకా అధికారికంగా ఏ వివరాలు వెల్లడించడం లేదు. ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇంకా చదవండి.





















