అన్వేషించండి
IAS Transfers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీ - 21 మందికి స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు
Andhra News: ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. దాదాపు 21 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది.
21 IAS Offiecers Transfers in AP: రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్ ల బదిలీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు
- అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా అభిషిక్త్ కిషోర్
- శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా మంజీర్ జిలానీ
- తిరుపతి జిల్లా కలెక్టర్ గా లక్ష్మీ షా
- నంద్యాల జిల్లా కలెక్టర్ గా కె.శ్రీనివాసులు
- పార్వతీపురం మన్యం జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా శ్రీకేష్ లాఠకర్ బాలాజీరావు
- జీవీఎంసీ అదనపు కమిషనర్ గా విశ్వనాథన్
- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమణారెడ్డి
- శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా తమీమ్ అన్సారియా
- పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఇల్లకియా
- కాకినాడ జాయింట్ కలెక్టర్ గా ప్రవీణ్ ఆదిత్య
- ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా రోణంకి గోపాలకృష్ణ
- సర్వే సెటిల్ మెంట్ అదనపు డైరెక్టర్ గా గోవిందరావు
- డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా రోనంకి కూర్మనాథ్
- విశాఖ జాయింట్ కలెక్టర్ గా మయూర్ అశోక్
- విజయనగరం జాయింట్ కలెక్టర్ గా కార్తిక్
- అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా భావన
- ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా హరిత
- నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆదర్శ్ రాజేంద్రన్
- తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అదితిసింగ్
- పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్ట్ మెంట్ కార్యదర్శిగా రేఖారాణిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion