Today Top Headlines: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రత్యేక భేటీ - ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల ప్రత్యేక భేటీ
దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ బృందాలతో స్విట్జర్లాండ్ కు వెళ్లారు. ఈ క్రమంలో జ్యూరిచ్ విమానాశ్రయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాలకు రావాల్సిన పెట్టుబడులపై చర్చించారు. విదేశాల్లోనూ తెలుగు వారంతా ఒకటేనని అభివృద్ధిలో మాత్రం పోటీ పడతామని సంకేతాలిచ్చారు. ఇంకా చదవండి.
2. టీడీపీలో పెరిగిన ఆ డిమాండ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఏపీ కి ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ పెరుగుతోంది. మొదట్లో పార్టీ క్యాడర్ నుంచి మొదలైన ఈ డిమాండ్ ప్రస్తుతం పార్టీ లీడర్ల వరకు పాకిపోయింది. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ వినిపిస్తున్న డిమాండ్ల వెనకాల పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయా అన్న కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది. ఇంకా చదవండి.
3. కేంద్రంపై నిప్పులు చెరిగిన షర్మిల
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యలకు రంగులు మార్చే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైసీపీ పాలన ఓ విపత్తు అని నిజంగానే అనుకుంటే.. 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని మీరు వేడుక చూశారా అని అమిత్ షాను ప్రశ్నించారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా కేంద్రం నుంచి అడిగారా ? రాజధాని లేని రాష్ట్రంగా ఏపీలో 5 ఏళ్లు పాలన చేస్తుంటే మీకు కనిపించలేదా ?. ఇంకా చదవండి.
4. మైనింగ్ వద్దంటూ రైతుల పోరుబాట
‘మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం ప్రజలు పోరుబాట పట్టారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. మైలారంలోని గుట్టతో విడదీయలేని అనుబంధం ఉంది ఆ గ్రామస్థులకు. కానీ ఆ గుట్టపై ప్రభుత్వం మైనింగ్‌కు అనుమతివ్వడంతో మైలారం గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. కొంత కాలంగా నిరసనలు చేపడుతున్నారు. అక్కడి రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమవడంతో.. అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంకా చదవండి.
5. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakarrao), శంకర్‌రావును రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చివరిగా నేరస్తుల అప్పగింత (Extradition)అస్త్రంను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇంకా చదవండి.





















