Pattabhi : పట్టాభికి 2 వారాల రిమాండ్.. బెయిల్ పిటిషన్ దాఖలు !

పట్టాభికి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. ఆయన తరపు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

FOLLOW US: 

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం రాత్రి సమయంలో ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి  3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. నవంబర్ 2 వరకు పట్టాభికి రిమాండ్ విధించారు. దీంతో మచిలీపట్నం సబ్‌జైలుకు పట్టాభిని తరలించే అవకాశం ఉంది. 

Also Read : టీడీపీ గుర్తింపు రద్దుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం... వైసీపీ నేత సజ్జల కామెంట్స్.. ఏపీలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ దీక్షలు

కోర్టులో పట్టాభిని హాజరు పరిచిన సమయంలో ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ప్రెస్ మీట్ వీడియో క్లిప్పింగ్‌ పరిశీలించాలంటూ పట్టాభి న్యాయమూర్తిని కోరారు. తనకు నోటీస్ ఇవ్వకుండానే రాత్రి 9.30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని తెలిపారు. మధ్యవర్తులు లేకుండానే తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని న్యాయమూర్తికి తెలిపారు. అయితే పోలీసులు కొట్టలేదని న్యాయమూర్తికి పట్టాభి చెప్పినట్లుగా తెలుస్తోంది. 

Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు

అయితే న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆ తర్వాత పట్టాభి తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ కాపీ రహస్యంగానే ఉంది. మొదట ఆయనపై రాజద్రోహం కేసు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సెక్షన్లు అందులో లేవని తెలుస్తోంది. 

Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..

గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో ప్రెస్‌మీట్‌లో పట్టాభి చేసిన వ్యాఖ్యలు బూతు మాటలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు కూడా చేశారు.  దీంతో వివాదం రాజకీయం అయింది. 

Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Oct 2021 06:21 PM (IST) Tags: ANDHRA PRADESH YSRCP tdp vijayawada Attacks on TDP Pattabhi Pattabhi remanded

సంబంధిత కథనాలు

No Change In Konaseema Name :  కోనసీమ జిల్లా పేరు మార్చేది లేదన్న ప్రభుత్వం - దాడులపై పరస్పర ఆరోపణలు

No Change In Konaseema Name : కోనసీమ జిల్లా పేరు మార్చేది లేదన్న ప్రభుత్వం - దాడులపై పరస్పర ఆరోపణలు

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

What Happend In Konaseema : పేరు మార్పుపై ఇంత రియాక్షనా ? ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేదు?

What Happend In Konaseema :  పేరు మార్పుపై ఇంత రియాక్షనా ? ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేదు?

Konseema Protest Live Updates: ఆ పేరు రాత్రికి రాత్రి పెట్టింది కాదు- మార్చే ఉద్దేశం లేదు: సజ్జల

Konseema Protest Live Updates: ఆ పేరు రాత్రికి రాత్రి పెట్టింది కాదు- మార్చే ఉద్దేశం లేదు: సజ్జల

Konaseema Name Change Protest: అగ్ని గుండంలా అమలాపురం- కొనసాగుతున్న విధ్వంసకాండ

Konaseema Name Change Protest: అగ్ని గుండంలా అమలాపురం- కొనసాగుతున్న విధ్వంసకాండ

టాప్ స్టోరీస్

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

GT vs RR, Qualifier 1: హార్దిక్‌నే వరించిన టాస్‌ - రాజస్థాన్‌ తొలి బ్యాటింగ్‌

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్

AP Government On CPS: సీపీఎస్‌ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన

AP Government On CPS: సీపీఎస్‌ అమలు సాధ్యం కాదు-  తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన