Corona Cases: ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ఒకరు మృతి
ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 184 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల వ్యవధిలో 29,595 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 184 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు.. కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,443కి చేరింది. కొత్తగా 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మెుత్తం 20,56,501 మంది బాధితులు ఇప్పటి వరకు కోలుకున్నారు. ప్రస్తుతం 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 01/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 1, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,70,198 పాజిటివ్ కేసు లకు గాను
*20,53,606 మంది డిశ్చార్జ్ కాగా
*14,443 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,149#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/WhnqyUDk4Y
దేశంలో కరోనా కేసులు
దేశంలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదుకాగా 267 మంది మృతి చెందారు. ఒక్కరోజే 10,207 మంది వైరస్ను జయించారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 99,023కు చేరింది.
- మొత్తం కేసులు: 3,45,79,228
- మొత్తం మరణాలు: 4,69,247
- యాక్టివ్ కేసులు: 99,023
- మొత్తం కోలుకున్నవారు: 3,40,28,506
టీకాల పంపిణీ
మంగళవారం ఒక్కరోజే 80,98,716 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం టీకాల పంపిణీ.. 1,24,10,86,850 కు చేరింది.
ఒమిక్రాన్ భయాలు..
ఒమిక్రాన్ వేరియంట్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్.. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమావేశమయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిపై పలు సూచనలు చేశారు.
కేంద్రం సూచనలు..
- కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలి.
- కరోనా నిర్ధరణ అయితే ఆ శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించాలి.
- ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, హోం ఐసోలేషన్ వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ కార్యక్రమం, మౌలిక వైద్యవసతులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి.
Also Read: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!
Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం... చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్ తర్వాత ఎవరు?
Also Read: ఏపీకి వరద సాయం రూ.895 కోట్లిచ్చాం .. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి ఆన్సర్ !