అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IAS TRANSFER: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు.... మీ జిల్లాకు ఎవరొచ్చారో చూసుకోండి...

16 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇందులో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు.


రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కడప, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లా కలెక్టర్లు ట్రాన్సఫర్‌ అయిన వారిలో ఉన్నారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్లను బదిలీ చేశారు. 

దేవాదాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా పని చేస్తోన్న పి.అర్జునరావును ఏపీ స్టేట్‌ హ్యాండ్‌ లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తోన్న జి.వాణీమోహన్‌ను దేవదాయ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు.
 
విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ పి.కోటేశ్వరరావును కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పంపించారు. ఆయన స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డిని నియమించారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డిని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ట్రాన్సఫర్‌ చేస్తూ.. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇక్కడ పని చేస్తోన్న విజయ్‌రామరాజును కడప జిల్లా కలెక్టర్‌గా పంపించారు. ఆ జిల్లా కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

విశాఖ కలెక్టర్‌గా పని చేస్తోన్న ఓడరేవు వినయ్‌చంద్‌ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ.. ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఇక్కడ పని చేస్తోన్న డాక్టర్‌ ఎ.మల్లిఖార్జునను విశాఖ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.

పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఎం.ప్రభాకర్‌రెడ్డిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ను ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా నియమించారు. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.సూర్యకుమారిని విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఈమె స్థానంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండ్యన్‌ను నియమించారు. 

శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ను పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఏపీ స్టేట్‌ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సోసైటీ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీగా పని చేస్తోన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. 

కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పని చేస్తోన్న స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget