Today Top Headlines: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ - కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In AP And Telangana:
1. సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
ఏపీ సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) సుప్రీంకోర్టులో (Supreme Court) భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలన్న గత వైసీపీ ప్రభుత్వ పిటిషన్‌ను బుధవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. ఇంకా చదవండి.
2. నారా బ్రాహ్మణికి లోకేశ్ అరుదైన గిఫ్ట్
ఏపీ సీఎం చంద్రబాబు సహా కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తన సతీమణి బ్రాహ్మణికి (Nara Brahmani) మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంకా చదవండి.
3. సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కాగా, ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చదవండి.
4. పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసులో కీలక పురోగతి
రంగారెడ్డి జిల్లా (Rangareddy) నార్సింగ్ పీఎస్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద మంగళవారం యువతీ, యువకుడు దారుణ హత్యకు గురి కాగా.. మృతులను పోలీసులు గుర్తించారు. యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ కాగా ఇతను హౌస్ కీపింగ్ చేస్తూ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. యువతి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు (25)గా గుర్తించారు. ఈమె ఎల్బీనగర్‌లో నివాసం ఉంటోంది. ఇంకా చదవండి.
5. నౌకాదళ అమ్ముల పొదిలోకి 3 అస్త్రాలు
భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి తాజాగా మరో 3 అస్త్రాలు చేరాయి. ముంబయిలోని (Mumbai) నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi) హాజరై.. యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి (INS Nilagiri), ఐఎన్ఎస్ సూరత్ (INS Surat), ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను (INS Waghgheer) బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది. ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోన్న భారత్‌కు ఇది పెద్ద ముందడుగే అని చెప్పాలి. ఇంకా చదవండి.