By: ABP Desam | Updated at : 16 Dec 2021 06:22 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో 33,043 పరీక్షలు నిర్వహించారు. ఇందులో 148 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వైరస్ కారణంగా చిత్తూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఇప్పటి వరకు మెుత్తం.. కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,474కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 152 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,131 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,821 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపంది.
#COVIDUpdates: 16/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 16, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,72,524 పాజిటివ్ కేసు లకు గాను
*20,56,236 మంది డిశ్చార్జ్ కాగా
*14,474 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,814#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/bIq44fcNH6
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 73 కేసులు నమోదయ్యాయి. బంగాల్, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. బంగాల్‌లో బుధవార ఉదయం తొలి కేసు నమోదుకాగా, తమిళనాడులో నిన్న సాయంత్రం నమోదైంది. మహారాష్ట్ర, కేరళలో నాలుగు చొప్పున ఒమిక్రాన్ కేసులు బుధవారం వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.
వార్నింగ్..
WHO ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఇండియాలో తీసుకున్న Covid-19 వ్యాక్సిన్లు ఈ వేరియెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతాయి. ఇది రీఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్‌లు లేదా గతంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ చికిత్స కారణంగా పొందిన రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్(Omicron) ఎంతవరకు తప్పించుకోగలదో తెలుసుకోడానికి మరింత డేటా అవసరమని పేర్కొంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నా.. ఒమిక్రాన్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు WHO స్పష్టం చేసింది. GISAID గ్లోబల్ సైన్స్ డేటాబేస్‌లో రిజిస్టర్ చేసిన డెల్టా వేరియెంట్ల సీక్వెన్స్‌ల శాతం ఇతర ఆందోళనకర వేరియంట్‌లతో పోల్చితే ఈ వారం క్షీణించిందని పేర్కొంది. డెల్టా(Delta) వేరియంట్ ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉందని, ప్రజలు మాస్క్, శానిటైజేషన్ తప్పకుండా పాటించాలని హెచ్చరించింది.
Also Readd:Kadapa News : ఇడుపులపాయ టు తాడేపల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ! వాళ్లకేం కష్టం వచ్చిందంటే ?
Tarakratna Vijayasai : తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది - బాలకృష్ణకు ధ్యాంక్స్ చెప్పిన విజయసాయిరెడ్డి !
Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!
Minister Gudivada Amarnath : అది ఫోన్ ట్యాపింగ్ కాదు కాల్ రికార్డింగ్, కోటంరెడ్డికి మంత్రి అమర్‌నాథ్ కౌంటర్
AP Capital Vizag: ఏపీ క్యాపిటల్ అని గూగుల్ లో సెర్చ్ చేసినా విశాఖనే వస్తుంది: స్పీకర్ తమ్మినేని
Union Budget 2023 : సామాన్యుడికి ఆశాజనకంగా కేంద్ర బడ్జెట్, కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయి - ఆర్థికమంత్రి బుగ్గన
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
Mamata Banerjee: నాకో అరగంట టైమ్ ఇస్తే ఇంత కన్నా మంచి బడ్జెట్ తెస్తా - మమతా బెనర్జీ
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Samantha Sorry To VD Fans : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సమంత - ఎందుకంటే?