Top Headlines: వైసీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే!, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. వైసీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉదయం మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. మధ్యాహ్నం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ పని చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి లేఖ రిలీజ్ చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి దూరంగా ఉన్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీతో చర్చలు పూర్తయ్యాయో కానీ ఆయన రాజీనామా చేశారు. ఇంకా చదవండి.
2. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
రాష్ట్రంలో చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయన్న మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. రానున్న 3 నెలల్లో ప్రతీ పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని అన్నారు. సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాలని.. 100 రోజుల పనిదినాలు సరిగా నిర్వహిస్తేనే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు. ఇంకా చదవండి.
3. మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లేనా!
మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాలకు తెరపడినట్లుగాకనిపిస్తోంది. మంచు మనోజ్ మొత్తం విషయాలు బయటపెడతానని ప్రకటించారు.కానీ అనూహ్యంగా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇవాళ షూటింగ్ కు వెళ్లిపోయారు. ఇక తాను ఏం మాట్లాడేది లేదని ఆయన సిగ్నల్ ఇచ్చారు. పూర్తిగా దారి తప్పిన వ్యవహారంలో అసలేం జరిగింది ?. మోహన్ బాబు కుటుంంబంలో పంచాయతీకి తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి.
4. మోహన్ బాబు వివాదాల చరిత్ర
మంచు మోహన్‌బాబు.. 500 సినిమాలకు పైగా నటించి.. 50 సినిమాల వరకూ నిర్మించి.. ఇంట్లో ముగ్గురు బిడ్డలను నటులుగా ఇండస్ట్రీకి అందించి.. టాలీవుడ్ మెయిన్ పిల్లర్లలో ఒకడిగా నిలిచిన వాడు. నటన విషయంలో మోహన్ బాబు టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అనొచ్చు. హీరోయిజమైనా, విలనిజమైనా, పౌరుషమైనా... పౌరాణికమైనా.. చివరకు కామెడీ అయినా సరే.. మోహన్‌బాబుకు తిరుగులేదు. అద్భుతమైన పాత్రలతో అలరించడమే కాదు.. అంతకంటే మంచి చిత్రాలను ప్రొడ్యూసర్‌గానూ అందించారు. 75ఏళ్ల పై వయసులో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ పెద్దదిక్కుగా ఉన్నారు. ఇంకా చదవండి.
5. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు (Jamili Election Bill) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. కాగా, జమిలి ఎన్నికలకు సంబంధించి గతంలో కోవింద్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్రం జమిలికే మొగ్గు చూపుతుండడంతో దీని కోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు సమాయత్తం అవుతోంది. ఇంకా చదవండి.