PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన డబ్బులు రాలేదా? మీ సమస్యకు పరిష్కారం ఇదే! వెంటనే ఇలా చేయండి
PM Kisan Yojana: మీ అకౌంట్‌లో పీఎం కిసాన్ యోజన డబ్బులు రాకపోతే కంగారు పడవద్దు. సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలు పాటించండి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

PM Kisan Yojana: దేశంలో కోట్లాది మంది రైతులు ఉన్నారు. వీరిలో చాలా మంది రైతులు ఆర్థికంగా బాగా లేరు. ఇలాంటి పేద, అవసరమైన రైతులకు, భారత ప్రభుత్వం PM కిసాన్ యోజన కింద సాయం చేస్తోంది. ఇటీవల, ప్రభుత్వం రైతుల ఖాతాలో పథకానికి చెందిన 20వ వాయిదా డబ్బులు వేసింది. వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమ మోదీ ఈ నిధులను చేశారు. మీరు కూడా PM కిసాన్ యోజన కోసం నమోదు చేసుకుంటే, ఇంకా డబ్బులు రాకుంటే ఈ చర్యలు తీసుకోండి.
ఇప్పటికీ కొందరు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ యోజన డబ్బులు పడలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అలాంటి వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఖాతాలో డబ్బులు రాకపోవడానికి కొన్ని సాధారణ కారణాలు ఉండవచ్చు. మీ వాయిదా మీ ఖాతాలో రాకపోతే, మీరు ఈ పని చేయవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
ఖాతాలో వాయిదా డబ్బులు రాకపోతే ఈ పని చేయండి
ఇటీవల, ప్రధాని మోదీ వారణాసి నుంచి PM కిసాన్ యోజనకు సంబంధించిన 20వ వాయిదాను విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ వాయిదా మీ ఖాతాలో రాకపోతే, మీరు మొదట వాయిదా ఎందుకు ఆగిందో చెక్ చేయాలి. దీని కోసం, మీరు పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించాలి. అక్కడ చెక్ యువర్ స్టాటస్ అనే కాలమ్పెద్దగా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ స్టాటస్ తెలుస్తుంది. అక్కడ లబ్ధిదారుల స్థితి (Beneficiary Status) ఎంపికపై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, చెల్లింపు పెండింగ్‌లో ఉందా లేదా తిరస్కరణకు గురైందా అని తెలుసుకోండి. తప్పు బ్యాంక్ వివరాలు, ఆధార్ నంబర్ తప్పుగా ఉండటం లేదా ఇ-కెవైసి అసంపూర్తిగా ఉండటం వంటి ఏదైనా తప్పు కనిపిస్తే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేయండి.
ఇ-కెవైసిని ఇలా చేయండి
మీ PM కిసాన్ యోజన ఖాతాలో మీ ఇ-కెవైసి పూర్తి కాలేదు అంటే దీన్ని పూర్తి చేయడానికి, మీరు మొదట పథకం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో ఇ-కెవైసి (e-KYC) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తరువాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సెర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
దీని తరువాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన వెంటనే, ఇ-కెవైసి పూర్తవుతుంది. మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే లేదా OTP రాకపోతే, సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లి వేలిముద్ర ద్వారా ఆఫ్‌లైన్ ఇ-కెవైసిని పొందవచ్చు. ఇంకా మీకు సందేహాలు ఉంటే 155261 / 011-24300606 నెంబర్లకు ఫోన్లు చేసి మీకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ నెంబర్లకు ఉచితంగా ఫోన్ చేసుకునే వెసులుబాటు ఉంది.





















