అన్వేషించండి

Weather Forecast 2026: భారత్‌లో 1877 నాటి కరవు పరిస్థితులు! సూపర్ ఎల్ నినో ప్రభావంతో అనూహ్య మార్పులు!

Weather Forecast 2026: ఈ ఏడాది వచ్చే సూపర్ ఎల్ నినో భారత్‌పై పెను ప్రభావం చూపనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆహార సంక్షోభం తప్పదట. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026లో అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్ నినో దేశాన్ని ప్రభావితం చేయనుంది.
  • పసిఫిక్ మహాసముద్రంలో అధిక ఉష్ణోగ్రతలు ప్రపంచ వాతావరణాన్ని దెబ్బతీస్తాయి.
  • తగ్గిన వర్షపాతం, పెరిగిన ఉష్ణోగ్రతలు వ్యవసాయం, ధరలపై ప్రభావం చూపుతాయి.
  • చెట్లు నాటడం, నీరు తాగడం, ఉద్గారాలు తగ్గించడం పరిష్కారాలు.

Weather Forecast 2026: ఈసారి ప్రకృతి తన వికృత రూపాన్ని ప్రదర్శించబోతోంది. 2026లో దేశం నిప్పుల కొలిమిలా మారుతోంది. రాబోయే రోజుల్లో ఆహార కొరత సామాన్యుడిని వేధించబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్ నినో కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదని దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి జీవనాన్ని అతలాకుతలం చేయగల శక్తి ఉంది. 

అసలు ఎల్‌ నినో అంటే ఏంటీ?

ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఒక అసాధారణ వాతావరణ పరిస్థితి. సాధారణంగా పసిఫిక్‌ మహాసముద్రం తూర్పు, మధ్య భాగాలలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్ నినో అని పిలుస్తారు. సాధారణం పరిస్థితుల్లో భూమధ్యరేఖ వెంబడి వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టివేస్తాయి. కానీ ఎల్ నినో సమయంలో ఈ పవనాలు బలహీనపడతాయి. దీని వల్ల వేడి నీరు వెనక్కి అమెరికా తీరం వైపు వెళ్తుంది. ఈ మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఒక చోట అతివృష్టి మరోచోట తీవ్రమైన కరవు ఏర్పడుతుంది. 

Also Read: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే

ఎల్‌ నినో సూపర్ ఎల్‌ నినోగా ఎందుకు మారుతుంది?

వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, 2026లో ఏర్పడబోయే ఎల్ నినో గత 140 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదిగా ఉండబోతోంది. యూర్‌కు చెందిన అధునాతన వాతావరణ నమూనాలు దీనిని మెగా ఎల్ నినో గా అభివర్ణిస్తున్నారు. సముద్ర మట్టం ఉష్ణోగ్రతలుగా సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరగడం వల్ల దీని ప్రభావం కూడా అంతే తీవ్రంగా ఉండబోతోంది. ఇది 1877 నాటి భయంకరమైన కరవు పరిస్థితులను గుర్తుకు తెచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 

Also Read: పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే

భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

భారత్ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలోని దాదాపు 51 శాతం వ్యవసాయ పనులు వర్షంపై ఆధారపడి ఉన్నాయి. సూపర్ ఎల్ నో ప్రభావంతో 2026లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వర్షాలు సరిగా లేకుంటే పంట దిగుబడి తగ్గి, రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. 

Also Read: కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తూర్పు, వాయవ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వడగాల్పులు వీయవచ్చు. కేవలం పగటిపూట మాత్రమ కాదు, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటం వల్ల మానవ శరీరం చల్లబడే అవకాశం దొరకదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పంట ఉత్పత్తి తగ్గడం వల్ల ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. సాధారణ ఎల్ నినో సమయాల్లోనే ఆహార ధరలు 5 శాతం వరకు పెరుగుతాయి. సూపర్ ఎల్‌ నినో వస్తే మాత్రం ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతుంది. 

ప్రజలు ఏం చేయాలి

చెట్లు స్థానిక ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు తగ్గించ గలవు. కాబట్టి ఉన్న చెట్లను కాపాడుకోవడంతోపాటు కొత్త మొక్కలు నాటడం మంచిది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాకపోవడం ఉత్తమం. తగినంత నీరు తాగడం, ఓఆర్‌ఎస్ వాడటం ద్వారా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అడవుల సంరక్షణ ద్వారా దీర్ఘకాలికంగా ఇటువంటి వాతావరణ మార్పులను అడ్డుకోవచ్చు. 

Frequently Asked Questions

ఎల్ నినో అంటే ఏమిటి?

ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు, మధ్య భాగాలలో నీటి ఉష్ణోగ్రతలు పెరిగే ఒక అసాధారణ వాతావరణ పరిస్థితి. ఇది ప్రపంచ వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది.

2026లో ఏర్పడబోయే ఎల్ నినో ఎందుకు సూపర్ ఎల్ నినోగా పరిగణించబడుతుంది?

2026లో ఏర్పడబోయే ఎల్ నినో గత 140 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదిగా అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరగడం దీనికి కారణం.

సూపర్ ఎల్ నినో భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

భారతదేశంలో వ్యవసాయం వర్షంపై ఆధారపడి ఉంటుంది. సూపర్ ఎల్ నినో వల్ల తక్కువ వర్షపాతం నమోదై, పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోతారు. ఆహార ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

సూపర్ ఎల్ నినో సమయంలో ప్రజలు ఏమి చేయాలి?

ప్రజలు చెట్లను కాపాడుకోవాలి, కొత్త మొక్కలు నాటాలి. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండాలి. తగినంత నీరు తాగడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget