Companion Plants: టమాటాలతో పాటు పెంచగలిగే, పెంచలేని మొక్కలు ఇవే
Companion Plants: సహచర పంట వల్ల చాలా లాభాలు ఉంటాయి. మీరు టమాటాలు వేసి ఉంటే.. వాటితో పాటు పెంచగలికే, పెంచలేని మొక్కలు ఏంటో తెలుసుకోండి. మీ ఇంట్లోనూ సులువుగా మొక్లు పెంచేయండి.
Companion Plants: సహచర పంట వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇవి ఇతర కీటకాలను ఆకర్షిస్తాయి. ఆ కీటకాలు ప్రధాన పంటకు సోకే తెగుళ్లను అరికడతాయి. వాటిని శత్రువులుగా చూస్తూ తెగుళ్లు సోకకుండా చూస్తాయి. సహచర పంట వల్ల ప్రధాన పంట ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అలాగే బీటల్స్, లేడి బంగ్ లను ఆకర్షించడంలో నేలను బ్యాలెన్సింగ్ చేయడంలో సహచర పంటలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
టమాటాలతో పాటు పెంచగలిగే సహచర మొక్కలు
టమాటాల పెంపకం అంత సులభంగా ఏమీ ఉండదు. వీటి పెంపకంలో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొగ్గ చివర తెగులు, శిలీంద్ర వ్యాధులు, టమాటా హార్న్ వార్మ్ లు, అఫిడ్స్, వైట్ ఫ్లైస్ తో క్రిమి తెగుళ్లు, అలాగే ప్రారంభ, ఆఖరి ముడతలు సోకుతాయి. వీటి నుండి టమాటాలను జాగ్రత్తగా కాపాడుకుంటేనే మంచి దిగుబడి చేతికి వస్తుంది. అయితే టమాటాలతో పాటు కొన్ని రకాల మొక్కలను నాటితే అవి టమాటా మొక్కలను సంరక్షిస్తాయి. టమాటా మొక్కలు చక్కగా ఎదిగేందుకు అవసరమయ్యే వాతావరణాన్ని అందిస్తాయి. ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. వాటిని టమాటాలతో పాటు పెంచితే.. టమాటా మొక్కలకు మేలు చేసే మిత్రుడు దొరికినట్లే.
తులసి.. తులసి, టమాటా మంచి స్నేహితులు. ఈ మొక్క మంచి సువాసనను అందిస్తుంది. అలాగే కీటకాలను, ముఖ్యంగా ఈగలను, హార్న్ వార్మ్స్ ను తరిమికొడతాయి.
వెల్లుల్లి.. వెల్లుల్లి సాలీడు పురుగులను దగ్గరికి రాకుండా చూస్తుంది. వెల్లుల్లి నుండి తయారు చేసే స్ప్రే మట్టిని సారవంతం చేస్తుంది. అలాగే మొక్కలకు ముడతలు రాకుండా రక్షిస్తుంది.
పచ్చిమిర్చి.. ప్రతి హెర్బ్ గార్డెన్ లో కీలకమైన అల్లియంతో పాటు, చివ్స్ పురుగులు నెమటోడ్ అఫిడ్స్ ను తరిమికొట్టేందుకు పచ్చి మిర్చి చక్కగా పని చేస్తుంది.
ఫ్రెంచ్ బంతి పువ్వులు నాస్టూర్టియంలు..
పాట్ బంతి పువ్వులు టమాటాలకు మేలుచేసే వాటిలో ముందుంటాయి. నాస్టూర్టియం మిరియాలు, చేదు నూనెలు సాధారణ తెగులు నిరోధకంగా పని చేస్తాయి. అలాగే బంతి పువ్వులు రూట్ నాట్ నెమటోడ్ లను తరిమివేస్తాయి. ఇది టమాటా మూల వ్యవస్థలోని పోషకాలను తినే పరాన్న జీవులు. అయితే నాస్టూర్టియం మొక్కలను టమాటా మొక్కలకు దగ్గరగా పెంచకూడదు. ఇవి వేగంగా పెరుగుతాయి. అలాగే ఎక్కువగా వ్యాపిస్తాయి.
బోరేజ్, స్క్వాష్..
బోరేజ్ మొక్క పుష్పాలు నీలి రంగులో ఉంటాయి. నక్షత్ర ఆకారంలో చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవి టమాటా హార్న్ వార్మ్ లను చక్కగా నిరోధిస్తాయి. టమాటాలను సంరక్షించడం, వాటి అభివృద్ధి అలాగే రుచిని మెరుగుపరచడంలో సహాయ పడతాయి.
పార్స్లీ, పుదీనా..
కొత్తమీర వంటి ఆకులతో ఉంటుంది పార్స్లీ. ఇది తినదగినది. టమాటాలతో పాటు సహచర మొక్కగా దీనిని నాటవచ్చు. పార్స్లీ, పుదీనా మొక్కలు నాటడం వల్ల టమాటాలకు సోకే హార్న్ వార్మ్ లను ఇవి నిరోధిస్తాయి. అలాగే మొక్క ఎదుగుదలకు సహాయం చేస్తాయి.
నిపుణుడిని సంప్రదించండి..
టమాటాలతో సరిపోని మొక్కలు చాలానే ఉన్నాయి. అయితే టమాటాలతో పాటు సహచర మొక్కలు నాటాలనుకుంటే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. వారు మీ ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని టమాటాలతో పాటు ఏయే మొక్కలు పెంచవచ్చో చెబుతారు.