అరటి సాగులో దేశంలోనే ఏపీ టాప్- నాలుగేళ్లుగాా నెంబర్ వన్
అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే ఇది ఇప్పుడి వ్యవహరం కాదు. దాదాపుగా నాలుగేళ్ళ నుంచి అరటి సాగులో ఏపీ టాప్‌లోనే నిలుస్తుంది.
అ అంటే అరటి ...ఆ అంటే ఆంధ్రప్రదేశ్... అంటున్నారు హర్టికల్చర్ అధికారులు. అవును దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అరటి సాగులో టాప్ ప్లేస్‌లో నిలిచిందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలోనే ఏపీ టాప్
అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే ఇది ఇప్పుడి వ్యవహరం కాదు. దాదాపుగా నాలుగేళ్ళ నుంచి అరటి సాగులో ఏపీ టాప్‌లోనే నిలుస్తుంది. ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2021-22లో ఆహార, వ్యవసాయోత్పత్తుల సంస్థ (ఎప్ఏవో) సేకరించిన గణాంకాల ప్రకారం 56.84 లక్షల టన్నులు అరటి ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. దేశ వ్యాప్తంగా నమోదైన అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ది 16.5 శాతం వాటా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
అనంతలో అరటి క్లస్టర్
హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా బనానా క్లస్టర్ కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైంది. అనంతపురంతో పాటు తమిళనాడులో థేని జిల్లాను కూడా బనానా క్లస్టర్ పైలెట్ ఫేజ్ కింద ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 55 క్లస్టర్లను హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద గుర్తించగా అందులో 12 క్లస్టర్లు పైలట్ ఫేజ్ కింద ఎంపిక చేసి అవసరం అయిన చర్యలను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేపడుతోంది.
అరటిలో దేశం కూడ టాప్..
ప్రపంచం మొత్తం మీద పండించే అరటి పండ్లలో 26.5శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉండటం మరో విశేషం. దేశంలో పెద్ద ఎత్తున అరటి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ తరువాతి స్థానంలో 4966.33 మెట్రిక్ టన్నులతో మహారాష్ట్ర ఉంది. తమిళనాడు (4236.96 మెట్రిక్ టన్నులతో) మూడో స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 34907.54 మెట్రిక్ టన్నుల అరటి ఉత్పత్తి జరుగనున్నట్లు ఎఫ్‌ఏఓ సంస్థ అంచనా వేసింది.
దేశంలో హార్టికల్చర్ రంగం అభివృద్దికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం కూడ అమలు అవుతోంది. హర్టికల్చర్ క్లస్టర్లలో భౌగోళికపరమైన ప్రత్యేక పంటలు ప్రోత్సహించేందుకు, ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో, పంట దిగుబడి తరువాత, లాజిస్టిక్స్, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు అవుతున్నాయి.
కేంద్ర సాయం
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ హార్టికల్చర్ కింద అరటి కోసం డ్రిప్ ఇరిగేషన్‌తోపాటు ఇంటిగ్రేటెడ్ ప్యాకేజీ కింద మొక్కలు నాటేందుకు, డ్రిప్ సిస్టం, పందిరి ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియెంట్స్ మేనేజ్మెంట్ (ఐఎన్ఐం), ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (ఐపీఎం) కోసం హెక్టార్‌కు చేసిన ఖర్చపై 40శాతం సాయం ప్రభుత్వమే అందిస్తోంది. అంతే కాదు ఇంటిగ్రేషన్ లేకుండా హెక్టార్‌కు అయ్యే అత్యధిక ఖర్చు 1.25 లక్షల్లో 40% సహకారం కూడా అందిస్తున్నారు. వీటికి తోడుగా కోల్డ్ స్టోరేజ్‌లు, రైపెనింగ్ సెంటర్ల ఏర్పాటు, రవాణా వాహనాలకు ఎంఐడీహెచ్ కింద క్రెడిట్ లింక్డ్ సహకారం కూడ లభిస్తుంది.