ఆదిలక్ష్మీ గ్యారేజ్.. ఇక్కడ అన్ని వాహనాలకు పంక్చర్ వేయబడును
ఆదిలక్ష్మీ మహిళా మెకానిక్.. ఇప్పుడు ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా ఫేమస్. ఇంకొన్నాళ్లలో తెలంగాణ అంతా ఫేమస్ కావచ్చు. ఎందుకంటే లారీ టైర్ల మరమ్మతు చేస్తున్న ఏకైక మహిళా మెకానిక్ కాబట్టి, హెవీ వెహికిల్స్ టైర్లను విప్పడం సామాన్యమైన విషయం కాదు. వాటికి పంక్చర్లు.. వేయడానికి చాలా బలం కావాలి. కాని ఆదిలక్ష్మీ ఆ పనులన్నీ సులువుగా చేస్తుంది. ఆ దారిలో మగవాళ్లు వేసే పంక్చర్లనైనా డ్రైవర్లు అనుమానిస్తారేమోగాని ఆదిలక్ష్మీ వేసే పంక్చర్లను అనుమానించరు. అంత ఈజీగా ఆమె పంక్చర్లు వేస్తుంది. ఖమ్మం – కొత్తగూడెం మార్గంలో సుజాతనగర్ వద్ద ఆదిలక్ష్మీ పంక్చర్ షాపు ఉంది. కేవలం పంక్చర్లు మాత్రమే కాదండోయ్ ఆమె టైర్లకు, వాహనాల బాడీలకు గ్రీజింగ్ చేస్తుంది.. వెల్డింగ్ పనులు కూడా చేస్తుంది.





















