Old Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు
Old Music Instruments Repair |
సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉంటుందంటారు. సంగీతం ద్వారా రోగాలు కూడా నయం చేయవచ్చు అనేది నానుడి..! ప్రస్తుతం అలాంటి సంగీత వాయిద్యాలు కనుమరుగవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు తబలా, హార్మోని లెనేదే సంగీతం లేదు అలాంటిది ఇప్పుడు డీజే, ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడకంలోకి రావడం తో ఈ పరికరాలు మూలన పడ్డాయాని సంగీతం వాయిద్యాల షాప్ యజమాని జగన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఒగ్గు కథలు చెప్పడానికి బుర్రకథలు చెప్పడానికి మాత్రమే కొన్ని గ్రామాల్లో మాత్రమే తబలా, హార్మోని మృదంగం తబలా లాంటి పరికరాలను వాడడం కూడా చాలా తక్కువగానే అయిపోయింది. వాటిని వాడే కొంతమందికి కూడా వాటిని బాగు చేస్తూ ఆకలని ఇంకా బతికిస్తున్నారు కొంతమంది ఆ వాయిద్యాలను రిపేర్ చేసే వారిలో ఒకరే కరీంనగర్ కు చెందిన సుధాకర్ లోకల్ ఏటీఎంతో మాట్లాడుతూ ఒకప్పుడు ఈ వాయిద్యాలను మా నాన్న రిపేర్ చేసేవారు .ఆ సమయంలో చాలామంది కళాకారులు ఉండేవారు కాబట్టి తమకు ఎక్కువగా పని ఉండేదని, మా నాన్న గారి తర్వాత గత 35 సంవత్సరాల నుంచి ఈ పరికరాలను రిపేర్ తానే చేస్తున్నానని జగన్ అన్నారు .