Mulugu Black Berry Island Explored |పస్రా చెక్ పోస్ట్ వైపు వెళ్తే బ్లాక్ బెర్రీ ఐల్యాండ్ చూడాల్సిందే
ప్రకృతి అందాలకు.. అనేక జలపాతాలకు నిలయమైన ములుగులో మరో పర్యాటక ప్రాంతం వెలుగులోకి వచ్చింది. అదే బ్లాక్ బెర్రీ ఐలాండ్. ఎడారిలో అనే భావన కలిగేలా ఇసుకమేటలతో ఉండే ఈ ఐలాండ్ చుట్టూ రెండు వాగులు ప్రవహించడంతో పాటు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ పర్యాటక ప్రాంతం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. బ్లాక్ బెర్రీ ఐలాండ్ ములుగు జిల్లా పస్రా కు సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. జాతీయ రహదారికి అనుకొని రెండు కిలోమీటర్ల దూరంలో రెండు వాగుల మధ్యన ఏర్పడిన ఐలాండ్ కే బ్లాక్ బెర్రీ ఐలాండ్ అని పేరు పెట్టారు. ఒకే వాగు రెండు పాయలుగా ఇక్కడ విడిపోయిందని విడిపోయి ఇక్కడ ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతం ఎడారి లా కనిపించటానికి రీజన్ అదే. దీని చుట్టూ యూ ఆకారంలో ఎత్తైన గుట్టలు, దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది.ఐలాండ్ అనుకుకొని వాగు ఒడ్డున ఫారెస్ట్ అధికారులు మూడు అంతస్తుల వాచ్ టవర్ ను నిర్మించారు. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు ఈ టవర్ ఎక్కి అడవి అందాలను చూస్తూ ఎంజాయి చేయవచ్చు. అయితే బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను చూడడానికి పస్రా చెక్ పోస్ట్ వద్ద అనుమతి తీసుకొని వెళ్ళాలి. పర్మిషన్ తోపాటు ఐలాండ్ కు వెళ్ళడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పర్యాటకులు పూర్తి స్థాయిలో ఎంజాయి చేయలేకపోతున్నారు