వరదలకు రైల్వే పట్టాలు కొట్టుకుపోయి..చిక్కుకున్న రైలు
మహబూబాబాద్ - కేసముద్రం మార్గంలో రైలు పట్టాలు వరదలకు కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాకుల మరమ్మతుల నిర్వహణ కు భారీ వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. మచిలీపట్నం రైలు అక్కడే నిలిచిపోవటంతో పాటు మిగిలిన రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతారయం కలుగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ప్రభావంతో ఇప్పటికే కొన్ని రైళ్లు రద్దు కాగా.. మరికొన్నింటిని రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఆదివారం నుంచి ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి 432 రైళ్లు రద్దు అయ్యాయి. 140 రైళ్లు దారి మళ్లాయి. అంతేకాకుండా మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దైన వాటిలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, పాసింజర్... ఇలా అనేక రకాల రైళ్లు ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు, వరద ఉద్ధృతితో అనేక ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు భారీగా దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో వరదలో చిక్కుకున్న రైళ్ల పరిస్థితి ఈ వీడియోలో.