Sircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీ
Sircilla Weavers: సిరిసిల్లలో 18 లక్షల రూపాయల విలువైన ఓ చీర తయారైంది. విజయ్ నల్ల అనే చేనేతకారుడు 18 లక్షల విలువైన ఈ చీరను తయారు చేశాడు. ఈ చీరలో 200 గ్రాముల బంగారాన్ని వాడినట్లుగా తయారీదారుడు చెబుతున్నారు. ఇలాంటి చీర తయారు చేయాలని తనకు హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చిందని విజయ్ తెలిపారు. ఆర్నెల్ల క్రితమే ఓ పెద్ద బిజినెస్ మేన్.. తన కూతురి పెళ్లి కోసం ఆ చీర ఆర్డర్ ఇచ్చారని చెప్పారు.
ఈ అత్యంత ఖరీదైన చీర తయారీ కోసం తాను లేటేస్ట్ డిజైన్ ఎంపిక చేసుకున్నానని విజయ్ చెప్పారు. ఆ గోల్డెన్ శారీ తయారీ కోసం తనకు 10 నుంచి 12 రోజుల సమయం పట్టిందని.. దాని వెడల్పు 49 అంగుళాలు, పొడవు 5.5 మీటర్లు వచ్చిందని వివరించారు. 200 గ్రాముల బంగారం చీర తయారీలో వాడడం వల్లనే దాని ఖరీదు 18 లక్షలు అయిందని వివరించారు.
సాంప్రదాయ నేత పద్ధతులను కాపాడుతూనే తన స్కిల్‌తో అద్భుతమైన కళారూపాన్ని చీరపై ఆవిష్కరించిన విజయ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్ వీవర్‌గా తనకున్న పేరును సుస్థిరం చేసుకోవడానికి తన డెడికేషన్ ఎంతో కారణమని విజయ్ తెలిపారు.