Karimnagar MLC Elections : కంచు కోట లాంటి స్థానం నుండి లుకలుకలు మొదలు
తెలంగాణ ఉద్యమ గడ్డ కరీంనగర్ లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కష్టాలు తప్పేలా లేవు.ఇప్పటికే పట్టణానికి చెందిన కీలక నేత రవీందర్ సింగ్ తన రాజీనామాతో మొదలైన అసమ్మతి జిల్లావ్యాప్తంగా వ్యాపించడంతో అనేక మంది లోకల్ నేతలు రాజీనామా బాట పట్టారు.ఇందులో భాగంగానే మొదటి నుండి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలబడ్డ అనేకమంది సీనియర్ నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ నిర్ణయాన్ని బాహాటంగా వివరిస్తూనే రాజీనామాలు చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎల్.రమణ లాంటి నేతలకు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా తమ నాయకులను అవమానాలను గురిచేసిన భానుప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎమ్మెల్సీ ని కొనసాగించడం కూడా దుర్మార్గం అంటున్నారు స్థానిక సీనియర్ నేతలు.





















