Petrol Tankers Strike: హైదరాబాద్ వాసులారా టెన్షన్ పడొద్దు..! బంకుల్లో స్టాక్ ఎప్పటికి వస్తుందో క్లారిటీ వచ్చేసింది..!
ఇవాళ సాయంత్రం కొన్ని గంటల పాటు హైదరాబాద్ అంతా ఒకటే డిస్కషన్. పెట్రోల్ ట్యాంకర్ల స్ట్రయిక్, బంకుల వద్ద క్యూలు, ట్రాఫిక్ జాంలు. సింపుల్ గా చెప్పాలంటే అల్లకల్లోలం అయిపోయింది. కాసేపటికే లారీ, ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె విరమించినా, బంకుల దగ్గర రద్దీ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులందరికీ కాస్త ఊరటనిచ్చే విషయం. ట్యాంకర్లలో లోడ్ తో వాహనాలు అనేక ప్రాంతాల నుంచి స్టార్ట్ అయ్యాయి. అర్ధరాత్రికి బంకులకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి కూడా తెలిపారు. రాత్రికి అన్ని బంకులకు స్టాక్ వస్తుందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని గంటల్లోనే యథావిధిగా పెట్రోల్ సరఫరా తిరిగి ప్రారంభమవుతుందన్నారు.





















