వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహం
సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ సమీపంలో విజయ హెల్త్ కేర్ వెనకాల ఉన్న కుమ్మరిగూడ ముత్యాలమ్మ మందిరంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం వివాదాస్పదం అయింది. ముగ్గురు యువకులు ఈ పని చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిరసనలకు ప్రయత్నించగా.. ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రాజాసింగ్ ఇంటి వద్ద చుట్టూ పోలీసులు మోహరించారు. ముత్యాలమ్మ అమ్మవారిని చూసేందుకు తాను వెళ్తుండగా పోలీసులు ఎందుకు ఆపుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. తాను టెర్రరిస్టునా అని నిలదీశారు. అందరు నేతలకు పర్మిషన్ ఇస్తున్న పోలీసులు తనను ఎందుకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసుల నుంచి ప్రకటన రావడం లేదని రాజాసింగ్ అన్నారు. కనీసం దోషులను పట్టుకుంటామని కూడా పోలీసులు చప్పడం లేదని రాజాసింగ్ అన్నారు. మరోవైపు, ఈ ఆలయాన్ని ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సందర్శించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.