Hyderabad Civil Mock Drills | ఆపరేషన్ అభ్యాస్ ను తెలంగాణ, ఏపీల్లో నిర్వహించిన పోలీసులు | ABP Desam
భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల విభాగాలను పటిష్ఠం చేస్తున్నాయి. అందులో భాగంగానే సామాన్య ప్రజలకు మాక్ డ్రిల్స్ నిర్వహించటం ద్వారా అవగాహన కల్పించటంతో పాటు అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న తీరుపై ప్రతీ పౌరునికి అవగాహన ఉండేలా మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఆపరేషన్ అభ్యాస్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హైదరాబాద్ లో, ఆంధ్రలో విశాఖపట్నంలో మాక్ డ్రిల్స్ ను నిర్వహించారు. హైదరాబాద్ లో నానల్ నగర్, కంచన్ బాగా, సికింద్రబాద్, ఈసీఐఎల్ NFC లో మాక్ డ్రిల్స్ జరిగాయి. శత్రువులు ఆయుధాలతో దాడి చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలి ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలపై ప్రజలకు తెలియచేశారు. ఏపీలోనూ విశాఖపట్నంలోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించి ప్రజలకు విపత్తు సమయంలో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని సమీక్షించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.





















