Yellandu Urusu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘనంగా ప్రారభమైన ఉరుసు ఉత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాల జులుస్‌కు వేలాది మంది తరలివచ్చారు. తెలంగాణలోనే అతిపెద్ద ఉర్సు ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు జూలూస్ తీశారు. సత్యనారాయణపురం గ్రామంలోని నాగుల్‌మీరా దర్గా మౌలాచాన్ (చిల్లా) ఉర్సే షరీప్‌లో బాగంగా ఇల్లందు పట్టణంలోని దో నెంబర్ బస్తీ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. హజరత్ ఖాసీం హుస్సేన్ నుంచి ప్రారంభమైన జులుస్ ఇల్లందు పట్టణంలోని ప్రధాన వీదులగుండా సాగింది.య కులమతాలకతీతంగా వేలాది మంది భక్తులు ఈ జులుస్‌లో పాల్గొన్నారు. ఈ జులుస్‌లో ఆదివాసీల నృత్యాలు, డప్పు నృత్యాలతోపాటు మహారాష్ట్ర కళాకారుల విన్యాసాలు ప్రదర్శించారు.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

