Exit Polls Telangana Lok Sabha | తెలంగాణలో మోడీ మార్క్ కనిపిస్తుందా? | ABP Desam
రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఎంపీ ఎన్నికల్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో దూసుకు వెళ్లలేదు. కాంగ్రెస్ కు జనరల్ ఎలక్షన్ లో 7 నుంచి 9 ఎంపీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. సరిగ్గా ఇక్కడే బీజేపీకి ఏడు నుంచి 9 పార్లమెంటు స్థానాలు దక్కే అవకాశం ఉంది. అనూహ్యంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశం కనిపించటం లేదు. కేసీఆర్ ఈ సారి ఎంపీ ఎన్నికల్లో సున్నాకే పరిమితం అయ్యే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ఇక యాజ్ యూజువల్ గా హైదరాబాద్ ను ఎంఐఎం ను దక్కించుకునే అవకాశమే కనిపిస్తోంది. అక్కడ బీజేపీ తరపున జోరుగా ప్రచారం చేసిన మాధవీలతపై అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తున్నారని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.





















