White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో 58మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 4లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2024లో 45శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఈ సారి అది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో సహా వచ్చి ఎల్లారెడ్డి గూడ శ్రీనగర్ కాలనీ 290 బూత్ లో మాగంటి సునీత ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బిహార్‌లో తుదిదశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 122 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. రెండో విడత పోలింగ్ లో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. దాదాపు 3 కోట్ల 70 లక్షల మందికి పైగా ప్రజలు ఓట్ హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు.



















