కాంతార లాంటి కల్చర్, ఆదివాసీ దండారీ వేడుకలు చూద్దామా!
ఆదివాసీ గ్రామాల్లో డప్పుల చప్పుల్లు... తుడుం మోతలు... పర్ర, వెట్టే, ఘుమ్మేళ, వాయిద్యాల నడుమ పాటలు పాడుతూ చచ్చోయ్ కోలాట నృత్యాలు.. తలపై నెమలి పించాల టోపీ.. భుజానికి జంతువుల చర్మం.. మెడలో అడవుల్లో లభించే వనమూలికల హారాలు.. చేతిలో గంగారాం సోటా.. శరీరానికి విభూది రాసుకుని గుస్సాడి వేషధారణ.. దీపావళి సంధర్భంగా 8రోజులపాటు దండారి వేడుకలు... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నిర్వహించే దండారి వేడుకలపై abp దేశం ప్రత్యేక కథనం. ఆదివాసుల జిల్లాగా పేరిందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డల సంస్కృతి సాంప్రదాయాలు అందరికన్నా భిన్నంగా ఉంటాయి. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా గ్రామాల్లో దండారి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళికి ముందుగా 8 రోజుల ముందు అన్ని గోండు, కొలాం గూడాల్లో దండారీ వేడుకల సందర్భంగా తమ తమ గ్రామ పటెల్ ఇంటి ఆవరణలో దండారీ వేదిలకను రంగు రంగుల విద్యుత్ కాంతుల మద్య అందంగా అలంకరణలు చేసి ముస్తాబు చేస్తారు.