Shubman Gill Injury Before Asia Cup 2025 | గాయంతో బాధపడుతున్న శుబ్మన్ గిల్
టెస్ట్ క్రికెట్ కు కెప్టెన్ గా వ్యవరహించిన శుబ్మన్ గిల్ కు ఆసియా కప్ 2025లో వైస్ కెప్టెన్ పోస్ట్ దక్కింది. అయితే ఇప్పుడు శుబ్మన్ గిల్ కు సంబంధించి ఒక వార్త వినిపిస్తుంది. ఆసియా కప్ 2025లో శుబ్మన్ గిల్ ఆడటం కష్టమంటూ వార్తలు వస్తున్నాయి. శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆసియ కప్ కు ముందు గిల్ దులీప్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. ఇది కూడా ఆడటం కష్టమే అని అంటున్నారు. దులీప్ ట్రోఫీలో శుభ్‌మాన్ గిల్ నార్త్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
ఆసియా కప్ టోర్నీకి గిల్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి దులీప్ ట్రోఫీలో కేవలం మొదటి మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కు శుబ్మన్ గిల్ అందుబాటులో ఉండడని ఒక టాక్ వినిపిస్తుంది. కంప్లీట్ గా రెస్ట్ తీసుకోని ఆసియా కప్ 2025 టోర్నీకి అందుబాటులో ఉండాలని గిల్ ప్లాన్ చేస్తున్నారట. అయితే, ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.





















