Virat Kohli AB Devilliers Hug RCB Win IPL 2025 | మ్యాచ్ గెలవగానే డివిలియర్స్ ను హగ్ చేసుకున్న కోహ్లీ
18ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ ఐపీఎల్ ట్రోఫీని సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న కోహ్లీ ముందు ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత తనను తాను తమాయించుకుని జట్టు సహచర ఆటగాళ్లతో కలిసి గెలుపు సంబరం చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి కోసం గ్రౌండ్ లో వెతికాడు విరాట్ కోహ్లీ. తనే ఆర్సీబీ మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. ఏబీడీ తో కలిసి ఆర్సీబీకి కప్ కోసం శతథా కృషి చేసిన కోహ్లీ అప్పుడు అనుకున్నది సాధించలేకపోయాడు. అందుకే 18ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కప్పు అందుకున్న క్షణమే ఏబీ డివిలియర్స్ కోసం కోహ్లీ కళ్లు వెతికాయి. స్పెషల్ గెస్ట్ గా, వ్యాఖ్యాతగా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన డివిలియర్స్ ను చూడగానే కోహ్లీ చిన్న పిల్లాడు అయిపోయాడు. రెండు చేతులూ చాచుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి డివిలియర్స్ ను హగ్ చేసుకున్నాడు విరాట్. అప్పటికే ఎమోషనల్ గా డివిలియర్స్ కోహ్లీ ని చాలా సేపు హగ్ చేసుకుని అలాగే ఉండిపోయాడు. తమ కలను సాధించి నిజం చేసి చూపించిన విరాట్ కోహ్లీని అభినందించాడు ఏబీ డివిలియర్స్. ఈ తరం చూసిన ఇద్దరు గొప్ప ఆటగాళ్లు...తమ కప్పు కలను సాకారం చేసుకున్న క్షణంలో ఓ మిత్రుడు అందులో భాగస్వామ్యం కాకపోయినా గతంలో అతను పడిన కష్టాన్ని గుర్తిస్తూ కోహ్లీ అతనితోనే ఆ ఆనంద క్షణాలను పంచుకోవటం..కోహ్లీ, డివిలియర్స్ మధ్య దోస్తీ..ఈ ఫోటోలు ఫ్యాన్స్ ను ఎమోషనల్ చేస్తున్నాయి.





















