PBKS vs RCB Qualifier 1 Weather Update IPL 2025 | వర్షం పడి మ్యాచ్ జరగకపోతే ఏం అవుతుంది.? | ABP Desam
పంజాబ్, ఆర్సీబీ జట్ల మధ్య ఈరోజు జరగనున్న క్వాలిఫైయర్ 1 పై అందరీ ఆసక్తి నెలకొంది. ఈరోజు గెలిచిన జట్టు ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా ఫైనల్ కి వెళ్లిపోవచ్చు. ఓడిన జట్టుకు ఇంకో ఛాన్స్ ఉంటుంది కానీ క్వాలిఫైయర్ 2 ఆడాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఎలిమినేటర్ లో ముంబై, గుజరాత్ జట్లు తలపడి ఒకటి క్వాలిఫైయర్ 2 కి విజేతగా రావాల్సి ఉంటుంది. సో ఇవాళ గెలిస్తే ఇక ఫైనల్ మ్యాచ్ ఆడటమే బాకీ...అదే ఓడిపోతే కప్ కొట్టడానికి రెండు మ్యాచులు ఆడి గెలవాల్సి ఉంటుంది. కానీ ఎటూ కాకుండా ఆర్సీబీ, పంజాబ్ మ్యాచ్ లో వర్షం పడితే…? మ్యాచ్ కు గంట గ్రేస్ టైమ్ ఉంటుంది. సో ఆఖరికి 5 ఓవర్ల మ్యాచ్ పెట్టడానికైనా నిర్వాహకులు చూస్తారు. అది కూడా సాధ్యపకుండా వర్షం కురుస్తూనే ఉంటే మ్యాచ్ రద్దు చేసినట్లు ప్రకటించి పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కి పంపిస్తారు. కారణం క్వాలిఫైయర్ 1 కి రిజర్వ్ డే లేదు. అంటే ఇంకో ఈ రోజు మ్యాచ్ పెట్టరు కాబట్టి లీగ్ దశలో టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్ కింగ్స్ కు అడ్వాంటేజ్ అయ్యి ఆ జట్టు ఫైనల్ కి చేరుతుంది. ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 ఆడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ రిపోర్టుల ప్రకారం మ్యాచులు జరిగే ముల్లాన్ పూర్ లో అసలు వర్షం పడే అవకాశమే లేదు. ముల్లాన్ పూర్ లో ఇప్పటి వరకూ ఈ సీజన్ లో నాలుగు మ్యాచులు జరిగితే రెండు భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లు జరిగే రెండు మ్యాచుల్లో పంజాబ్ చిన్న చిన్న లక్ష్యాలను కాపాడుకుంది. ఆర్సీబీ ఈ సీజన్ లో బెంగుళూరు బయట ఆడిన మ్యాచులు వరుసగా 7గెలిచి విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేస్తోంది. ఈ రోజు బెంగుళూరులో కూడా గెలిస్తే 8మ్యాచ్ లు గెలిచి తన రికార్డులను తనే బద్ధలు కొట్టుకున్న జట్టవుతుంది.





















