PBKS vs MI Qualifiers 2 Yuzvendra Chahal Returns | క్వాలిఫైయర్ 2 లో కమ్ బ్యాక్ ఇస్తున్న చాహల్ | ABP Desam
ముంబైకి బౌలింగ్ లో ట్రంప్ కార్డు...తురుపుముక్క అంటే ఎవరు. బౌల్ట్ లాంటి బౌలర్ ఉన్నా కూడా వాళ్లు నమ్ముకునేది నమ్మకం పెట్టేది ఏస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మీదే. మరి అలాంటి బౌలర్ పంజాబ్ కింగ్స్ కి లేడా అంటే అన్నాడు కానీ గత మూడు మ్యాచులుగా అతని సేవలను మిస్ అవుతోంది పంజాబ్ కింగ్స్. తనే యుజువేంద్ర చాహల్. పంజాబ్ కింగ్స్ కే కాదు ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ అంటే చాహలే. 219 వికెట్లు ఉన్నాయి చాహల్ ఖాతాలో. ఐపీఎల్ లో మరే బౌలర్ కూడా 200 లకు పైగా వికెట్లు తీయలేదు. ఈ ఐపీఎల్ లో కూడా చాహల్ మంచిగానే బౌలింగ్ చేశాడు. 12 మ్యాచ్ లు ఆడిన 14 వికెట్లు తీశాడు. కేకేఆర్, చెన్నై జట్లపై నాలుగేసి వికెట్లు తీశాడు. పంజాబ్ 111 పరుగులకే ఆలౌట్ అయ్యినప్పుడు కేకేఆర్ ను 95పరుగులకే ఆలౌట్ చేసి పంజాబ్ సంచలనం సృష్టించినప్పుడు 4 వికెట్లు తీసి దుమ్మురేపాడు చాహల్. అలాంటి చాహల్ గాయం కారణంగా గడచిన మూడు మ్యాచ్ లు ఆడకపోవటంతో డల్ అయ్యింది. క్వాలిఫైయర్ 1 లో అటు పేస్ బౌలింగ్ లో మార్కో యాన్సన్ లేక..ఇటు స్పిన్ బౌలింగ్ లో చాహల్ లేక పంజాబ్ తడబడింది. ఆర్సీబీ చేతిలో ఓడింది. ఇప్పుడు ఫైనల్ కి వెళ్లాలంటే..ముంబైని ఓడించాలంటే చాహల్ లాంటి సీనియర్ బౌలర్ అవసరం పంజాబ్ కి ఉంది. చాహల్ కూడా గాయం నుంచి కోలుకుని ఈ రోజు మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి పంజాబ్ ప్రయోగించనున్న ఈ బ్రహ్మాస్త్రం క్రూషియల్ టైం లో పంజాబ్ ను సేవ్ చేస్తుందేమో.





















