MI vs GT Match preview IPL 2025 | నేడు ముంబైతో తలపడనున్న గుజరాత్ టైటాన్స్
ఈరోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి జాగ్రత్తగా ఆడుకుంటూ విజయాలతో వస్తున్న గుజరాత్ టైటాన్స్...నాలుగు మ్యాచులు ఓడిపోయినా పడిలేచిన కెరటంలా వరుసగా ఆరు విజయాలతో పాయింట్స్ టేబుల్ లో పైకి దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ ని ఈ రోజు ఢీకొట్టనుంది. రెండు జట్లకు చెరో 14 పాయింట్ల ప్రస్తుతం ఉండగా అగ్రస్థానంలో 16 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. సో ఈ రోజు గుజరాత్, ముంబై లో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానం కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టెన్, సూర్య కుమార్ యాదవ్ బీభత్సమైన ఫామ్ లోకి రావటం ముంబై కి అన్నవిధాలుగా కలిసొస్తోంది. ఇక బౌలింగ్ బుమ్రా, బౌల్ట్ ఎలాగో ఉండే ఉన్నారు. మరోవైపు గుజరాత్ సమష్ఠిగా రాణిస్తోంది. సాయి సుదర్శన్ పరుగుల యంత్రంలా మారిపోయాడు. గత మ్యాచ్ లో గిల్ తృటిలో సెంచరీ మిస్సయిన కసిలో ఉంటాడు కచ్చితంగా. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ బౌలింగ్ తో జీటీ చాలా బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ముంబైకి 6 విజయాలు వరుసగా సాధించటమే రికార్డు. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే..చెన్నై, ఆర్సీబీ, కోల్ కతాలను సమం చేస్తుంది. ఆ మూడు జట్లకు ఒకే సీజన్ లో 7వరుస విజయాల రికార్డు ఉంది. పంజాబ్ కు అత్యధికంగా 8వరుస విజయాల రికార్డు ఉంది. సో ముంబై ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వరుసగా రెండు విజయాలు సాధించటం ప్లే ఆఫ్స్ కి దర్జా గా వెళ్లటం పెద్ద కష్టంగా అయితే అనిపించదు హైదరాబాద్ కి.





















