![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KKR vs SRH Highlights | Travis Head and Abhishek Sharma | ఓపెనర్లే బలం, బలహీనత.. ఏంటో SRH..! | ABP
KKR vs SRH Highlights | Travis Head and Abhishek Sharma | ఎవరికైనా.. ఏదైతే బలమో అదే బలహీనంగా కూడా మారుతుంది. క్వాలిఫైయర్స్ 1లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో SRH విషయంలో ఇది నిజమైంది. హైదరాబాద్ కు ఓపెనర్లు ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మలే బలం. వాళ్లు త్వరగా అవుట్ అవడంతో..SRH చాలా అంటే చాలా బలహీనంగా కనిపించింది. 9.4 ఓవరల్లోనే 160కిపైగా పరుగులు ఛేజ్ చేసిన టీమ్..వీళ్లు అవుట్ కాగానే టీమ్ మొత్తం కలిసి 160 పరుగులు కొట్టడానికి ఆపసోపాలు పడింది. స్టార్క్ బౌలింగ్ లో 2వ బాల్ కే ట్రావెస్ హెడ్ డకౌట్ అవుట్ అయ్యాడు..అభిషేక్ శర్మ 3 పరుగులకే వెనుతిరిగాడు. పవర్ ప్లేలో కనీసం 80 పరుగులు కొట్టే వీళ్ల జోడి.. 5 పరుగులు కూడా చేయకుండా పెవిలియన్ బాట పట్టడంతో అక్కడే SRH ఓడిపోయింది. ఎందుకంటే..ఈ టోర్నమెంట్ లో వీళ్లిద్దరిది సక్సెస్‌ఫుల్ జోడి. వీరిద్దరు కలిసి 676 పరుగుల పార్ట్‌నర్ షిప్ నమోదు చేశారు. ఇందులో 3 సార్లు వందకుపైగా పార్ట్ నర్ షిప్ ఉంది. LSGతో ఏకంగా 9.4 ఓవర్లలోనే 160కుపైగా టార్గెట్ ను ఫినిష్ చేశారు. ఓవరాల్ గా.. వీళ్ల పార్ట్ నర్ షిప్ స్ట్రైక్ రేట్ సుమారు 230గా ఉంది. ఈ దెబ్బకు లీగ్ లో అత్యధికంగా పవర్ ప్లే లో SRH స్ట్రైక్ రేట్ 11కుపైగా ఉంది. ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే.. SRH బలమే వీళ్లిద్దరు..వీళ్లు ఎంత తక్కువ సేపు క్రీజులో ఉంటే ప్రత్యర్థికి అంత బలం. నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో ఇదే జరిగింది. కావున.. తరువాత జరగబోయే క్వాలిఫైయర్స్ 2లో నూ ఆడితే వీళ్లిద్దరే ఆడాలి. వీళ్లిద్దరు ఆడితే ఫైనల్ ఆశలు లేకుంటే.... హైదరాబాద్ ఇంటి బాట పట్టాల్సిందే..!
![Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/dad508784667309a11664f77c9bd58681732627552439310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/0edbeba94380e25e52026139a67377f41732626400026310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/19/2de60e7cb4d477e167b3f97410810d2e1732021669031310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Rishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/19/86d0c4bccdbf4eca4659b84c4a2920c71732021523662310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/05/b849e87ca9623c1707cebe83ec10e9f21730824631225310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)