అన్వేషించండి

Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!

Maharashtra CM Update: మహారాష్ట్ర సీఎం పీఠంపై పంచాయితీ కొలిక్కి వచ్చింది. ఈ రేసు నుంచి ఏక్‌నాథ్‌ షిండే తప్పుకున్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Maharashtra CM Name: మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాదించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమైంది. అయింతే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేయాలనే విషయంపై నాలుగు రోజులుగా ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. 

ఢిల్లీ పెద్దల చర్చలతో ఏక్‌నాథ్‌ షిండే తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతే కాకుండా రెండు మూడు రోజుల్లోనే ప్రమాణ స్వీకారానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. మూడు పార్టీలు సంయుక్తంగానే ఫడ్నవీస్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏక్‌నాథ్‌ షిండేను కేంద్రమంత్రిగా పంపిస్తారని కూడా మహారాష్ట్రలో జోరుగా ప్రచారం సాగుతోంది. 

శనివారం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిదీ అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 132 సీట్లు గెలుచుకుంది. అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ మద్దతుదారులు పట్టుబట్టారు. అయితే ఏక్నాథ్ షిండే కూడా దూకుడుగా వ్యవహరించి ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. 

ఇరు వర్గాల నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో ముంబైలో జరిగే చర్చలు ఢిల్లీకి చేరాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం ఏకనాథ్ షిండేకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన ఏక్నాథ్ షిండే కాస్త వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

మహాయుతి విజయానికి ఏక్‌నాథ్ షిండే సహకారం, ప్రజల మద్దతు ఉందని షిండే మద్దతుదారులు చెప్పే ప్రయత్నం చేశారు. షిండే ముఖ్యమంత్రి కావాలంటూ అభిషేక్, ప్రార్థనలు చేపట్టారు. ఆయన పాపులారిటీని గుర్తు చేస్తూ సోషల్ మీడియా పోస్ట్‌లు కూడా వైరల్ చేశారు. కనీసం రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాలని ఏక్నాథ్ షిండే వర్గం ప్రయత్నించింది. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం తమ మాటలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

ఏక్‌నాథ్‌ షిండే వెనక్కి తగ్గక తప్పలేదు. 
ముఖ్యమంత్రి పదవి కోసం ఏక్‌నాథ్ షిండే నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. బీజేపీ నేతలు మాత్రం గట్టిగా నిలబడ్డారు. ఫడ్నవీస్‌కే అవకాశం ఉందని పదే పదే చెబుతూ వచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చారని షిండే వార్గం వాదిస్తుంటే... లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఫలితాలు వస్తుండగానే దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ ఊపందుకుంది. కేంద్ర మంత్రి వర్గంలోకి ఏక్‌నాథ్ షిండేను తీసుకోవాలని సూచనలు చేశారు.  
షిండే గ్రూపు నేతల మెతక వైఖరి
బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన సందేశం వచ్చిందని రాందాస్ అథవాలే తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవి షిండేకు లభించదని బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఏక్నాథ్ షిండే రేసు నుంచి తప్పుకున్నట్టు స్పష్టమైంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై గట్టిగా మాట్లాడిన షిండే వర్గీయులు ఇప్పుడు స్వరాన్ని తగ్గించారు. బీజేపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని అంటున్నారు. ప్రతి పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం సహజమని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటన చేశారు. 

Also Read: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
CSIR UGC NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Embed widget