Delhi Capitals performance IPL 2025 | ఢిల్లీ మొదలుకు..ముగింపునకు సంబంధమే లేదు
ఈ ఐపీఎల్ సీజన్ లో అసలు సంబంధమే లేని రెండు ఎక్స్ ట్రీమ్స్ ను చవి చూసింది ఢిల్లీ క్యాపిటల్స్. అసలు ఢిల్లీ మొదలుకు ముగింపునకు సంబంధమే లేదు. ఆడిన మొదటి ఆరు మ్యాచుల్లో ఐదు గెలిచి టాప్ ప్లేస్ లో ఫస్టాఫ్ ను సూపర్ హిట్ సినిమా రేంజ్ లో ఇంటర్వెల్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత మ్యాచుల్లో ఘోరం అంటే ఘోరంగా విఫలమైంది. ఆఖరి తొమ్మిది గేమ్స్ లో అనూహ్యంగా రెండు మాత్రమే గెలిచి ఊహించని రీతిలో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది ఢిల్లీ. మంచి బ్యాటింగ్ లైనప్..కేఎల్ రాహుల్ బీభత్సమైన ఫామ్...విప్రాజ్ నిగమ్, అభిషేక్ పోరల్, అశుతోష్ శర్మ లాంటి యంగ్ స్టర్స్ డైనమైట్ ఇన్నింగ్స్ తో ఫస్టాఫ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచినా సెకండాఫ్ కి వచ్చేసరికి కష్టాలన్నీ చుట్టుముట్టాయి. రాహుల్ కి సపోర్ట్ చేసే బ్యాటర్ లేకుండా పోయాడు. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ ఫెయిల్ అవటం, కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ లో సెంచరీ తో అదగొట్టిన కరుణ్ నాయర్ మళ్లీ మెరకపోవటం..అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా బౌలింగ్ లో ఫెయిల్ అవటం..గ్యాప్ తర్వాత మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాకపోవటం ఇలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు ఎన్నో కారణాలు ఢిల్లీని సెకాండాఫ్ లో అథ: పాతాళానికి తొక్కేశాయి. దురదృష్టం కూడా ఢిల్లీని వెంటాడింది. సెకండాఫ్ లో హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే...పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ ఆపరేషన్ సిందూర్ కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. ఆ రెండు మ్యాచుల తేడా ప్రభావం కూడా ఢిల్లీపై బీభత్సంగా పడింది. మొత్తంగా ఫస్టాఫ్ లో సూపర్ హిట్ సినిమా చూపించిన ఢిల్లీ మ్యాజిక్ ను సీజన్ ఎండ్ వరకూ కంటిన్యూ చేయలేక డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. అసలు ఐపీఎల్ చరిత్రలోనే మొదటి నాలుగు మ్యాచులకు నాలుగు మ్యాచులు గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లకపోవటం ఇదే తొలిసారి. ఆ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది ఢిల్లీ క్యాపిటల్స్.





















