IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వరుసగా రెండో విజయం
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటుతోంది. వరుసగా రెండో లీగ్ మ్యాచ్ లోనూ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ పై 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు సాధించింది.
ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ డకౌట్ అవడంతో 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ, సూర్య బౌండరీలతో సత్తా చాటారు. మూడో వికెట్ కు కీలకమైన 53 పరుగులు జోడించారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో నమన్ ధీర్, శాంట్నర్ పోరాడగలిగే స్కోరును అందించాడు.
అనంతరం ఛేజింగ్ ను ఆడుతూ పాడుతూ ఢిల్లీ ఛేదించింది. కేవలం 18.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 164 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. సమీర్ రిజ్వీ సూపర్బ్ ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా రాహుల్ బాగా పెర్ఫర్మ్ చేయాలనీ కోరుతున్నారు ఫ్యాన్స్
ట్రెండింగ్ వార్తలు





















