India vs England Test Match Day 2 Highlights | పూర్తి ఆధిపత్యం చూపించిన ఇంగ్లాండ్
మాంచెస్టర్ టెస్ట్ లో రెండో రోజు ఇంగ్లాండ్ పూర్తిగా ఇండియాని డామినేట్ చేసింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యం చూపించింది.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీ కూడా అదరగొట్టాడు. 358 పరుగులు చేసి ఇండియా అల్ ఔట్ చేసింది. తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ బజ్‌బాల్ ఆటను చూపించిందని అంటున్నారు ఫ్యాన్స్. ఓపెనర్లు జాక్ క్రాలీ , బెన్ డకెట్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. 32 ఓవర్లలో 166 పరుగులు చేసారు. ఆ తర్వాత కొద్దీ సేపటికే ఇద్దరూ ఔట్ అయ్యారు. ప్రస్తుతం ఓలీ పోప్, జో రూట్ బ్యాట్టింగ్ చేస్తున్నారు. చాలా మెల్లగా ఆడుతూ వికెట్ ను కాపాడుకుంటున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 225 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇంకా 113 రన్స్ వెనకబడి ఉంది.
ఇండియా బౌలర్లు బుమ్రా 13 ఓవర్లు, మహమ్మద్ సిరాజ్ 10 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. డెబ్యూ ప్లేయర్ అన్షుల్ కాంబోజ్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మరి మూడవ రోజు బుమ్రా, సిరాజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.





















