Umpire KumarDharmasena Controversy | Eng vs Ind సిరీస్ లో భారత్ కు వ్యతిరేకంగా అంపైరింగ్ | ABP Desam
అంపైర్ అంటే క్రికెట్ లో న్యాయనిర్ణేత. తన నిర్ణయాలపైనే మ్యాచ్ ఫలితాలు ఆధారపడే సందర్భాలు ఉంటాయి. అంపైర్ మీద కన్నెర్ర చేసినా ఫైన్ల మోత మోగించటానికి ఐసీసీ సిద్ధంగా ఉంటుంది. అలాంటిది ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఓ అంపైర్ భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఐసీసీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. పైగా మన జైషానే ఐసీసీ పెసిడెంట్ కూడా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే కుమార ధర్మసేన అని శ్రీలంకకు చెందిన ఐసీసీ ప్యానెల్ అంపైర్ ఇంగ్లండ్, భారత్ సిరీస్ లో అంపైరింగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఐదో టెస్టులో అతని వ్యవహార శైలిలో పూర్తిగా ఇంగ్లండ్ కు అనుకూలంగా, భారత్ కు బద్ధ వ్యతిరేకంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న మనోళ్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జోష్ టంగ్ వేసిన బాల్ సాయి ప్యాడ్స్ ను తాకినట్లు కనిపించి బౌలర్ జోష్ టంగ్ కాన్ఫిడెంట్ గా అప్పీల్ చేశాడు. అప్పుడు అంపైర్ గా ఉన్న ధర్మసేన నాటౌట్ అన్నాడు. అక్కడితో ఆగిపోవాలి. జోష్ టంగ్ అండ్ ఇంగ్లండ్ ఉన్న కాన్ఫిడెన్స్ కి రివ్యూకి వెళ్లేలా కనిపించారు. బట్ ఈలోపే కంగారు ఆగని అధర్మ సేన సారీ ధర్మ సేన తన చేతి వేళ్లతో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుందని అర్థం వచ్చేలా సైగ చేశాడు. చేతిలో కోట్ ఉండకపోవటంతో అప్పటికప్పుడు కనపడకపోయినా రీప్లేలో ఆ సిగ్నల్ దొరికేసింది. అంపైర్ సిగ్నల్ ను అర్థం చేసుకున్న బౌలర్ రివ్యూకి వెళ్లలేదు. వెళ్లి ఉంటే కచ్చితంగా ఇంగ్లండ్ ఓ రివ్యూ అవకాశం కోల్పోయింది. ఇది కచ్చితంగా భారత్ కి వ్యతిరేక చర్యే. అంపైర్ లో ఉండే నేచురల్ ఇన్ స్టింక్స్ట్ అంటే ఎందుకు నాటౌట్ కాదో ఏళ్లుగా చెబుతూ రావటం అంపైర్లకు అలవాటు కదా ఈ రివ్యూ సిస్టమ్స్ వచ్చింది ఈ మధ్యే. అలా ఫ్లోలో చెప్పేశాడు తప్పు చేశాడు అని చాలా మంది వెనుకేసుకొచ్చారు. కానీ నిన్న సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అంతే. నోరేసుకుని ఇంగ్లీషు లో పచ్చి బూతులు తిడుతూ ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చగొట్టినప్పుడు మాట్లాడని ధర్మసేన...నిన్న ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో జో రూట్ తిడుతున్నా మనోళ్లను మాట్లాడొద్దని చెబుతూ హెచ్చరికలు జారీ చేశాడు. తిట్టింది రూట్ అని ప్రసిద్ధ్ ని ఎందుకు ఆపుతున్నావ్ అంటూ రాహుల్ వచ్చి అడిగితే నీ ముందుకు ఓ బౌలర్ వచ్చి తిడితే నీకు ఓకేనా అంటూ మాట్లాడాడు ధర్మ సేన. అక్కడ తిడుతోంది రూట్.. మమ్మల్నేం చేయమంటాం బౌలింగ్, బ్యాటింగ్ చేసుకుని వెళ్లిపోమంటావా వాళ్లు తిడుతుంది నీకు వినపడట్లేదా అని రాహుల్ తిరిగి అడిగితే..అవన్నీ మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం అని ఇష్యూను క్లోజ్ చేసేశాడు ధర్మసేన. ఇదంతా భారత్ కు వ్యతిరేకంగా అంపైర్ వ్యవహరిస్తున్న శైలి అంటూ ధర్మసేన అంపైరింగ్ పై భారత్ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.





















