Team India Manchester Train Journey and walked in rain | మాంచెస్టర్ కు రైలు ప్రయాణం..తర్వాత వర్షంలో బ్యాగులు మోసుకుంటూ | ABP Desam
లార్డ్స్ టెస్టులో తృటిలో ఓడిపోయిన భారత జట్టు మిగిలిన రెండు టెస్ట్ మ్యాచులు గెలుచుకోవాలని కసితో ఉంది. అందులో భాగంగా నాలుగో టెస్టు ఆడేందుకు మాంచెస్టర్ కు రైలు ప్రయాణం చేశారు భారత క్రికెటర్లు. సాధారణంగా క్రికెటర్లు ఏదైనా దేశంలో ఆడేప్పుడు ఓ నగరం నుంచి మరో నగరానికి విమాన ప్రయాణం చేస్తారు. లేదు దగ్గరి నగరాలైతే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణిస్తారు. కానీ మాంచెస్టర్ లో భారీ వర్షం కారణంగా ఎయిర్, రోడ్ ట్రాఫిక్ ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు రైలు ప్రయాణం చేయకతప్పలేదు. మొత్తం ఆటగాళ్లంతా లండన్ నుంచి మాంచెస్టర్ కు రైలులో వెళ్లారు. అక్కడితో అయిపోలేదు. తమ బ్యాగులను, భారీ క్రికెట్ కిట్లను తమే మోసకుంటూ మాంచెస్టర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ పాయింట్ వరకూ నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో వర్షం వస్తుండటంతో వానలో తడుస్తూనే క్రికెటర్లు బస్సు వరకూ వెళ్లాల్సి వచ్చింది. జనరల్ గా దేశానికి ఆడటం ముందు వరకూ ఇలాంటి సీన్స్ కామనే అయినా...బీసీసీఐ ప్రపంచంలోనే ధనిక బోర్డు కావటంతో ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఓ రకంగా వాళ్లు మహారాజ సౌకర్యాలను సమకూరుస్తుంది ఇండియాలో. కానీ ఇప్పుడున్నది వాళ్లు మాంచెస్టర్ లో కాబట్టి ఇలా వర్షంలో తడవక తప్పలేదు...రైలు ప్రయాణం చేయటాలు..తమ కిట్ బ్యాగ్ లను తమే మోసుకోవటాలు తప్పలేదు.





















