Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించడంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఫినిషర్‌గా రాణిస్తూ, కీపర్ గా కూడా ప్రసంశలు అందుకున్నాడు. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు జితేష్ శర్మ .. ప్రీతి జింటా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జితేష్ శర్మ గతంలో మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ 2026 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని తిరిగి దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. తొలుత ఆర్సీబీ 7 కోట్లకు బిడ్ వేయగా, పంజాబ్ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించింది. అయితే, ఆర్సీబీ పట్టువదలకుండా ఆ మొత్తాన్ని 11 కోట్లకు పెంచడంతో పంజాబ్ వెనక్కి తగ్గక తప్పలేదు. అలా జితేష్ శర్మ భారీ ధరకు ఆర్సీబీ సొంతమయ్యాడు.
ఈ వేలం ముగిసిన తర్వాత ప్రీతి జింటా స్వయంగా జితేష్‌కు ఫోన్ చేసిందట. "ప్రీతి జింటా నాకు పెద్దక్క లాంటిది. మేమిద్దరం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వాళ్లం కావడంతో మా మధ్య మంచి అనుబంధం ఉంది. వేలంలో నన్ను పంజాబ్ తరఫున తీసుకోవాలని ఆమె చాలా ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో ఆమె నాకు ఫోన్ చేసి సారీ చెప్పారు. నేను పంజాబ్ జట్టును వీడి వెళ్తున్నందుకు ఆమె బాధపడ్డారు, కానీ నాకు భారీ ధర వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించారు" అని జితేష్ వివరించాడు.
ట్రెండింగ్ వార్తలు






















