Hardik Pandya Bowling vs Pak | Ind vs Pak మ్యాచ్ లో పాండ్యా బౌలింగ్ ది కీలకపాత్ర | ABP Desam
కళ్ల ముందు లో స్కోర్ థ్రిల్లర్ ఉంది. కాపాడుకోవాల్సిన లక్ష్యం చాలా తక్కువ. అలాంటి టైమ్ లో పరుగులు ఆపటమే కాదు వికెట్లు కూడా తీయగలిగితేనే మ్యాచులు గెలుస్తాం. దాన్ని ఫర్ ఫెక్ట్ ఎక్సిక్యూట్ చేసింది జస్ ప్రీత్ బుమ్రా అయితే..బూమ్ బూమ్ కి అద్భుతంగా సపోర్ట్ చేసింది వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్ లో ఆదుకోలేకపోయిన పాండ్యా బౌలింగ్ లో మాత్రం టీమిండియాకు బాగా హెల్ప్ చేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ లో 24పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఇది నార్మల్ గానే అనిపించినా హార్దిక్ వేసింది మిడిల్ ఓవర్లలో. ప్రత్యేకించి 12-17 ఓవర్ల మధ్యలో పరుగులు పెద్దగా రానీయకుండా..వికెట్లు తీస్తూ పాండ్యా చేసిన హెల్పే మ్యాచ్ ను గెలిపించింది. 13ఓవర్లో వాళ్ల కీలక బ్యాటర్ ఫకార్ జమాన్ ను, 17ఓవర్ లో షాదాబ్ ఖాన్ ను అవుట్ చేసిన పాండ్యా మ్యాచ్ ను టీమిండియా వైపు తిప్పటంలో మంచి సపోర్టింగ్ రోల్ పోషించాడు. ఐపీఎల్ టైమ్ లో ముంబై ఇండియన్స్ ను నడిపించలేకపోయాడంటూ వచ్చిన ట్రోల్స్...వైఫ్ కి విడాకులు ఇస్తున్నాడంటూ నడిచిన డ్రామా ఈ అవుటాఫ్ ది ఫీల్డ్ టాపిక్స్ తో విసిగిపోయిన పాండ్యా ఫ్యాన్స్ కి నిన్న మ్యాచ్ మంచి కమ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. ఇక బ్యాటింగ్ లో వైస్ కెప్టెన్ గారూ ఆదుకుంటే..ఈ వరల్డ్ కప్ లో ఆల్ రౌండర్ షోతో భారత్ అదరగొట్టేయడం ఖాయం