Gautam Gambhir Failures as a Coach | టీమిండియా ఓడిపోతుంటే గంభీర్ ను తిడతారేంటీ.? | ABP Desam
గంభీర్ టీమిండియా హెచ్ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పుడు అందరి ఆలోచనా ఒకటే. కోపంతో ఊగిపోతుంటాడు కానీ ఆటగాడిగా గొప్పోడు. గెలవాలనే తపన ఉంటుంది ఆ కసితో రగిలిపోతుంటాడు. ఎదురుగా ఉన్నది విరాట్ కొహ్లీ అయినా సరే గొడవకు సై అంటాడు. ఇలాంటోడు టీమిండియాకు హెడ్ కోచ్ అయితే భారత్ క్రికెట్ జట్టు దశ దిశా మారిపోతుంది అనీ. ఈ సారి ఈ కార్డు చూపించిది. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్ గా సాధించిన చివరి టెస్ట్ సిరీస్ లు ఇవి. ఎక్కడైనా ఓడిపోయామా. కానీ గంభీర్ అయ్యగారు టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక అంతా ఆయన చెప్పిందే రాజ్యం. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాచ్ మొత్తాన్ని తీసుకొచ్చి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో పోస్టులు ఇప్పించాడు. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్. ర్యాన్ టెన్ డష్కటే బ్యాటింగ్ కోచ్…శ్రీధర్ ని మాత్రం మార్చలేకపోయాడు కానీ లేదంటే ఏ రస్సెల్ నో తెచ్చేవాడని అప్పట్లో జోకులొచ్చాయి. సరే హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో భారత ప్రదర్శన ఇది. ఆఖరి తొమ్మిది టెస్టుల్లో భారత్ గెలిచినవి ఏకైక టెస్టు మ్యాచ్. ఓ టెస్టు డ్రా అయ్యింది. ఏడు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయింది. కోచ్ కాగానే న్యూజిలాండ్ మన దేశానికి వస్తే 12ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ను ఓడిపోయి వాళ్లకు 25 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్ట్ సిరీస్ ని విజయాన్ని అందించింది గంభీర్ జమానా. సరే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి పదేళ్ల తర్వాత బీజీటీ కప్పును ఆసీస్ చేతిలో పెట్టి వచ్చేలా చేసింది గంభీర్ జమానా. ఇప్పుడు ఇంగ్లండ్ తో సిరీస్ లో మొదటి టెస్టు ఓటమి. సరే అన్ని మ్యాచులు ఇండియానే గెలవాలని లేదు. అందులో గంభీర్ చేసేది కూడా ఏం లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్యాన్స్ అలా అనుకోవట్లేదు. విరాట్ కొహ్లీ టెస్టులకు ఉన్నపళంగా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. రోహిత్ శర్మ టెస్టులను వదిలేశాడు. సరే సీనియర్లు లేకుండా పోయారు ఉన్న వాళ్లకు ఛాన్స్ లు బాగా వస్తాయి అనుకుంటే ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ను కన్సిడర్ చేయలేదు. ఆడిన ఆఖరి టెస్టులో 150 రన్స్ కొట్టిన సర్ఫరాజ్ ఖాన్ ను పక్కన పడేశారు. సుదర్శన్, కరుణ్ నాయర్ లకు అవకాశం వచ్చింది మంచి విషయమే. కానీ ఆల్ రౌండ్లు, బౌలర్ల ఎంపికలో విమర్శలు వచ్చాయి. ప్రధానంగా శార్దూల్ ఠాకూర్ ను నితీశ్ కుమార్ రెడ్డిని కాదని ఎందుకు ఆడిస్తున్నారో తెలియదు. అర్ష్ దీప్ ను కాదని కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా..ఏం హాలత్ రా భయ్ అంటున్నారు ఫ్యాన్స్. జడ్డూ తప్ప కుల్దీప్ కు చోటు ఉండదు టీమ్ లో. అన్నింటికంటే పైగా కోహ్లీని పంపేశాడు...రోహిత్ కెప్టెన్సీ పీకేశాడు అనే తలనొప్పి. వెరసి ఇటు రిజల్టూ లేక అటూ తను అనుకున్నవి సక్సెసూ కాక గంభీర్ ను ఆడేసుకుంటున్నారు. ఫ్యాన్స్. తప్పేముంది అది టాలెంటు..ఆర్టు అన్న వాళ్ల కూడా ఇప్పుడు అరే దీన్నే సంధి దశ అంటారు..దీన్ని దాటాలి టీమిండియా అని కొత్త నినాదాలు వెతుక్కుంటున్నారు.





















