Anshul Kamboj in India vs England 4th Test | టీం ఇండియాలోకి ధోనీ శిష్యుడు
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో రేపటి నుంచి నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ ఇప్పటి వరకు ఫైనల్ టీంలో ఎవరు ఉండబోతున్నారు అన్నది ఒక అంచకాకు కూడా ఎవరు రాలేక పోతున్నారు. అందుకు కారణం ఇండియా కీలక ప్లేయర్లు గాయాల పాలవడం. నితీష్ రెడ్డి, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ కు గాయం అవడంతో అన్షుల్ కాంబోజ్ ను బీసీసీఐ ఇంగ్లాండ్ కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో అన్షుల్ కాంబోజ్ డెబ్యూ చేస్తాడని కూడా అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ 24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ టీమిండియాతో చేరనున్నట్లు తెలుస్తోంది.
అన్షుల్ కాంబోజ్ ఇంగ్లాండ్ లయన్స్‌తో భారత్ ఏ తరఫున ఆడాడు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి 8 మ్యాచ్‌లలో 8 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 24 మ్యాచులు ఆడిన అన్షుల్ 79 వికెట్లు పడగొట్టాడు. ఇలా మంచి ఫార్మ్ లో ఉన్న పేసర్ ను ఈ మ్యాచ్ లో ఉపయోగించుకోవాలని చూస్తుంది టీం ఇండియా.
ఇండియా బౌలర్ల విషయానికి వస్తే ఈ సిరీస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా రాణించలేకపోయాడు. కాబట్టి టీంలో ఉండడం కష్టంగానే కనిపిస్తుంది. ఒక వేల బుమ్రా ఆడితే... సిరాజ్‌తోపాటు లకు అన్షుల్ కాంబోజ్ పేసర్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మాంచెస్టర్‌లో చివరి మూడు రోజులు స్పిన్నర్లు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే కుల్దీప్ యాదవ్ ను ప్లేయింగ్ 11 లో చేర్చే ఆలోచనలో టీం ఇండియా ఉన్నట్టు తెలుస్తుంది.





















