Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
ఐర్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి కంటే, ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ విషయంలో జరిగిన ఒక అంపైరింగ్ డ్రామా ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
183 రన్స్ భారీ ఛేజింగ్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్,కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పవర్‌ప్లేలోనే ఫెయిల్ అయినా.. అభిషేక్ శర్మ ఒక్కడే వన్‌మ్యాన్ షోతో ఐరిష్ బౌలర్లను ఉతికేసాడు. 8వ ఓవర్లో సింగిల్ తీసి 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. స్కోర్ బోర్డుపై 50 రన్స్ అని పడటంతో అభిషేక్ బ్యాట్ పైకెత్తి సెలెబ్రేట్ చేసుకున్నాడు, డగౌట్‌లోని ప్లేయర్స్ కూడా క్లాప్స్ కొట్టారు. కానీ ఆ మరుసటి బంతికే అతను 49 రన్స్‌కే అవుట్ అయ్యాడని తెలిసి అందరూ షాక్ అయ్యారు!
అసలేం జరిగిందంటే.. ఇండియా ఇన్నింగ్స్ 2వ ఓవర్ లాస్ట్ బాల్‌కు అభిషేక్ ఒక సింగిల్ తీసాడు. మొదట అంపైర్ దాన్ని బ్యాట్ రన్‌గా ఇచ్చాడు. కానీ ఆ తర్వాత రివ్యూలో అది బ్యాట్‌కు తగల్లేదు, 'లెగ్ బై' అని తేలింది. దీంతో అభిషేక్ అవుట్ అయ్యాక అంపైర్లు ఆ ఒక్క పరుగును అతని ఖాతా నుంచి తీసేసి లెగ్ బైగా మార్చారు. ఫలితంగా అభిషేక్ స్కోరు 50 నుంచి 49 రన్స్‌కు పడిపోయింది. సెలెబ్రేట్ చేసుకున్నాక హాఫ్ సెంచరీ మిస్ అవ్వడం అంటే బ్యాడ్ లక్కే కదా చేస్తున్నారు ఫ్యాన్స్.
ట్రెండింగ్ వార్తలు






















