Zimbabwe Cricketer Match Fixing: జింబాబ్వే స్టార్ ఆటగాడిపై ఐసీసీ వేటు!
అంతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టించింది. 2019 లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని సోషల్ మీడియా లో పేర్కొన్నాడు టేలర్. ఆర్ధిక సమస్యల కారణంగా ఆ వ్యక్తి నుంచి కొంత నగదును కూడా తాను తీసుకున్నట్లు అంగీకరించాడు టేలర్. కానీ క్రికెట్ మ్యాచ్లను తాను ఎప్పుడూ ఫిక్స్ చేయలేదని తెలిపాడు బ్రెండన్ టేలర్. గతం లో యాంటీ డోపింగ్ నేరానికి కూడా పాల్పడ్డాడు బ్రెండన్ టేలర్. ఈ వ్యవహారం పై స్పందించిన ఐసీసీ టేలర్ పై అంతర్జాతీయ క్రికెట్ నుంచి మూడున్నర సంవత్సరాలు బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. గత ఏడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టేలర్ జింబాబ్వే తరపున 205 వన్డేలు, 34 టెస్టులు, 45 టీ20లు ఆడాడు.





















