(Source: Poll of Polls)
Trump on India Pakistan Ceasefire | భారత్ పాక్ మధ్య కాల్పులు ఆగింది నా వల్లే | ABP Desam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన కారణంగానే భారత్, పాకిస్థాన్ మధ్య భారీ యుద్ధం ఆగిందని చెప్పారు. సౌదీ అరేబియాలో పర్యటించిన ట్రంప్..అక్కడి అతిథులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్, పాక్ ప్రస్తావన తీసుకువచ్చారు. "కొద్దిరోజుల ముందు భారత్ -పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసి మా ప్రభుత్వం ఓ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. నేను వ్యాపార వాణిజ్యాలను సాకుగా చూపించి ఇదంతా చేయగలిగాను. అణ్వాయుధాల వ్యాపారం కాదు మీ దేశాలను గొప్పగా మార్చుకునే వ్యాపారాలు చేద్దామని చెప్పాను. మోదీ, షరీప్ ఇద్దరూ చాలా పవర్ ఫుల్ లీడర్లు..అంతే కాదు వాళ్లు తెలివైన నేతలు. వాళ్లు మా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించారు. మార్కో రూబియో, జేడీ వ్యాన్స్ ఇంకా నా టీమ్ కి కృతజ్ఞతలు తెలపాలి. వాళ్లు చాలా కష్టపడ్డారు. మనం అసలు మోదీని, షరీఫ్ ని కలిపి డిన్నర్ కు తీసుకు వెళ్లాలి. ఆ యుద్ధమే కనుక జరిగి ఉంటే కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోయేవారు".





















