Owaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదన
MLA Akbaraddin Owaisi prayed for Palestine: నిరాయుధ యాహ్యా సిన్వార్‌ను చంపడంపై ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన పాలస్తీనా కోసం ఆయన ప్రార్థించారు. తన నియోజకవర్గం చంద్రాయణగుట్టలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. నిరాయుధుడైన సిన్వార్‌ను ఇజ్రాయెల్ చంపిందని ఆవేదన చెందారు.
రఫాలో కొద్ది రోజుల క్రితం జరిగిన సైనిక చర్యలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ధ్రువీకరించారు. యాహ్యా సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీని కూడా ఇజ్రాయెల్ మిలిటరీ రిలీజ్ చేసింది. తీవ్రంగా గాయపడిన యాహ్యా సిన్వర్ ఆ డ్రోన్ పై ఒక వస్తువును విసురుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అంతేకాక, సిన్వర్ మరణానికి ముందు తన భార్య పిల్లలతో బంకర్ నుంచి తన వస్తువులను కూడా తీసుకుని వెళ్లిపోతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.