Tollywood Updates : న్యూ ఇయర్ గిఫ్ట్ గా తెలుగు ప్రజలకు సినిమా అప్ డేట్స్..
ఏబీపీ దేశం ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనలానే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇవాళ న్యూ ఇయర్ 2022 ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే వారిని ఆ స్థాయిలో ఉంచి, ఎల్లప్పుడూ ఆదరించే ప్రేక్షకులకు ప్రత్యేకంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని నిర్ణయించుకుని వారు నటిస్తున్న సినిమాల నుంచి ప్రత్యేకమైన అప్ డేట్స్ ను రిలీజ్ చేశారు. మన వెంకీ మామ, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్ 3, మాస్ మహారాజ రవితేజ ఖిలాడీ, మెగాస్టార్ ఆచార్య, ప్రభాస్, పుజాహెగ్డే నటించిన రాధేశ్యామ్ చిత్రాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను శనివారం విడుదల చేశారు. వీటితో పాటు శర్వానంద్, రష్మిక మందన కలిసి నటిస్తున్న ఆడవాళ్లకు జోహార్లు చిత్ర పోస్టర్ కూడా రిలీజైంది.





















