SaiTeja Final Rites : వేలాదిమంది అశ్రునయనాల మధ్య వీరజవాన్ అంతిమసంస్కారాలు పూర్తి
వీర జవాన్ సాయి తేజ పార్థీమదేహానికి సైనిక లాంఛనాలతో ఘనమైన వీడ్కోలు పలికారు ఆర్మీ అధికారులు. హెలికాఫ్టర్ ప్రమాదంలో వీర మరణం పొందిన సాయి తేజ పార్థివదేహాన్నీ ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి ఏపీ సరిహద్దుల్లోకి తీసుకు రాగా.... అక్కడ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ తో సాయితేజ పార్థివదేహం ఎగువ రేగడ గ్రామానికి చేరుకుంది. కర్ణాటక బోర్డర్ నుంచి ఎగువ రేగడ గ్రామానికి వీరజ జవాన్ భౌతికకాయం చేరుకొనే వరకు.... దారి పొడవునా... సెల్యూట్ చేస్తూ.... జోహార్ సాయి తేజ అంటూ నినాదాలు చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీలో సైతం 10 వేల మంది పైగా పాల్గొన్ని సాయితేజకు ఘనమైన నివాళులు అర్పించారు. స్వగ్రామం చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్నీ ప్రజల సందర్శనార్థం కొంత సేపు ఉంచారు. దాదాపు 70 వేల మందికి పైగా.... ఎగువ రేగడ గ్రామానికి చేరుకొని సాయితేజ పార్థీమదేహానికి నివాళులు అర్పించారు. చివరగా గ్రామంలో అంతిమ యాత్ర ప్రారంభించి స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఇండియన్ ఆర్మీ లాంఛనాలతో, రాష్ట్రప్రభుత్వ పోలీస్ వందనంతో వీరజవాన్ కు తుది వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వీరుడా ఇక సెలవంటూ అశ్రునయనాల మధ్య తుదివీడ్కోలు పలికారు.